ఎన్నికల సంఘం సర్క్యులర్‌కు ఓకే
న్యూదిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో ఓట్ల లెక్కింపు వేళ సీఎం మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఓట్ల లెక్కింపులో కేవలం కేంద్ర ప్రభుత్వ సిబ్బందిని మాత్రమే నియమిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ మమత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. లెక్కింపులో కేవలం కేంద్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులను నియమిస్తూ ఎన్నికల సంఘం జారీ చేసిన సర్క్యులర్ నిబంధనలకు విరుద్ధమేమీ కాదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. లెక్కింపు సిబ్బందిని కేవలం ఒకే వర్గం (కేంద్ర ప్రభుత్వం) నుంచి ఎంచుకునే వెసులుబాటు ఈసీకి ఉందని… కాబట్టి, ఆ సర్క్యులర్ తప్ప్పు అని చెప్పలేమని స్పష్టంచేసింది. ఏప్రిల్ 13 నాటి ఆ సర్క్యులరే అమలవుతుందని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఓట్ల లెక్కింపు సమయంలో అక్కడ తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధులు కూడా ఉంటారని వివరించింది. టీఎంసీ పిటిషన్‌పై తదుపరి ఆదేశాలు అవసరం లేదని పేర్కొంది.
The post మమతకు ‘సుప్రీం’లో చుక్కెదురు appeared first on Visalaandhra.


