‘బండ’ పై బాదుడు


వాణిజ్య సిలిండర్‌పై రూ.993 పెంపు

న్యూదిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో వంట గ్యాస్, పెట్రోల్ కొరత ఏర్పడి ప్రజలు, వ్యాపార వాణిజ్య వర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా వంట గ్యాస్ తీవ్ర సంక్షోభంగా మారింది. చాలా వరకు దాబాలు, రోడ్డుపై టిఫిన్ దుకాణాలు, రెస్టారెంటులు మÖతపడ్డాయి. ఇప్ప్పుడు మÖలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు వాణిజ్య సిలిండర్ ధరలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు బాంబ్ పేల్చాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర ఒక్క సిలిండర్ (19 కేజీలు)పై సగటున రూ.993 పెంచుతున్నట్లు చమురు సంస్థలు పేర్కొన్నాయి. శుక్రవారం నుంచి ఈ పెంపు అమల్లోకి వచ్చింది. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదని కేంద్రం వెల్లడించింది. రెండు నెలలు గడుస్తున్నా అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం ఎప్ప్పుడు ముగుస్తుందో తెలియని అనిశ్చితి నెలకొంది. ఇంధన రవాణాకు కీలకమైన హోర్మూజ్ జలసంధిలో అంతరాయాల కారణంగానే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభంకాగా…అప్పటి నుంచి వాణిజ్య సిలిండర్ ధరను మూడుసార్లు పెంచినట్లయింది. మార్చిలో రూ.144, ఏప్రిల్ ఒకటిన రూ.195, తాజాగా అమాంతం రూ.993 పెరిగింది. దీంతో ఒక్క సిలిండర్ ధర రూ.3వేలు దాటింది. హైదరాబాద్‌లో ఆ ధర రూ.3,315 కాగా, దిల్లీలో ఒక బండ ధర రూ.3,071గా ఉంది. ఈ ప్రభావం రెస్టారంట్లు, హోటళ్ల వ్యాపారాన్ని దెబ్బతీస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. హోటళ్లు ఆ భారాన్ని వినియోగదారులపై మోపే అవకాశం ఉంది. ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులేదు. అయితే, దేశీయ విమాన సంస్థలకు కేంద్రం ఊరట కల్పించింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరల్లో ప్రస్తుతానికి ఎలాంటి మార్పు లేదు. ఐదు కిలోల సిలిండర్ ధర మాత్రం రూ.914.50కి పెరిగింది.

The post ‘బండ’ పై బాదుడు appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *