Last Updated:
Simhachalam Temple: సింహగిరిపై కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలో మే 1వ తేదీన వైశాఖ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు దేవస్థానం అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Simhachalam Temple: సింహగిరిపై కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలో మే 1వ తేదీన వైశాఖ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు దేవస్థానం అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 30వ తేదీ నుండి మే 3వ తేదీ వరకు స్వామివారి అంతరాలయ దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు వెల్లడించారు.మే 1 (వైశాఖ పౌర్ణమి) పర్వదినం సందర్భంగా శుక్రవారం తెల్లవారుజామున 02:00 గంటలకు సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అనంతరం స్వామివారికి చందన సమర్పణ, ఆరాధన, రాజభోగం వంటి విశేష సేవలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.
సర్వదర్శనం: ఉదయం 06:30 గంటల నుండి భక్తులకు అనుమతి ఉంటుంది. మధ్యాహ్నం 02:30 నుండి 03:30 వరకు (పవళింపు సేవ), రాత్రి 07:00 నుండి 08:30 వరకు (ఆరాధన) సమయంలో దర్శనాలు నిలిపివేయబడతాయి. రాత్రి 09:00 గంటలకు కవాటబంధనంతో దర్శనాలు ముగుస్తాయి. వైశాఖ పౌర్ణమి మరియు రెండవ విడత చందన సమర్పణ ఉన్నందున, మే 1న సుప్రభాతంతో సహా అన్ని రకాల ఆర్జిత సేవలను రద్దు చేయడం జరిగింది. భక్తులు ఈ మార్పును గమనించి, తదనుగుణంగా తమ దర్శన సమయాలను ప్లాన్ చేసుకోవాలని మరియు దేవస్థాన సిబ్బందికి సహకరించాలని కోరడమైనది.
వైశాఖ పౌర్ణమి ఏర్పాట్లపై ఆలయ ఇఓ జల్లేపల్లి వెంకట్రావు ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎస్.డి.సి మధులత, స్థానాచార్యులు టి.పి. రాజగోపాల్, ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రాంబాబు, వెంకట రమణ, ఏఈఓ రమణమూర్తి, పంతం శ్రీనివాస్,డిప్యూటీ ఇంజినీర్ (i/c) రామరాజు, తాతాజీ తదితరులు పాల్గొన్నారు. పోలీస్, ఆర్.టి.సి, మెడికల్ మరియు హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులతో చర్చించి, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించారు. కావున పైన తెలిపిన విధంగా సింహాచలంలో దర్శనాలు , ముఖ్య కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఆయా సమయాల్లో చూసుకొని రావాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Visakhapatnam,Andhra Pradesh


