ఆగష్టు నుంచి రణ్‌వీర్ ‘ప్రళయ్’ ప్రారంభం


సినిమా: ‘ధురంధర్ 2’ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న నటుడు రణ్‌వీర్ సింగ్…గతంలో అంగీకరించిన కొన్ని సినిమాల నుంచి ఆయన వైదొలుగుతున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘ప్రళయ్’ టీమ్ స్పందిస్తూ ఆయన ఈ సినిమా నుంచి వైదొలగలేదని స్పష్టం చేసింది. రణ్‌వీర్ హీరోగా జై మెహతా తెరకెక్కిస్తున్న చిత్రమిది. వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు ఇటీవల ప్రచారం జరిగింది. ఈ విషయంపై చిత్ర బందం వివరణ ఇస్తూ… ‘రణ్‌వీర్, జై ఇద్దరూ ‘ప్రళయ్’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. నిరంతరం చర్చలు జరుపుతూ స్క్రిప్ట్‌ను లాక్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. భారతీయ సినిమాలో ఇప్పటివరకు చూడని ఓ భారీ అద్భుతాన్ని తెరపై ఆవిష్కరించేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. ఆగస్టులో ‘ప్రళయ్’ షూటింగ్ ప్రారంభమవుతుంది’ అని వెల్లడించింది. దీనికోసం హిందీ చిత్రాలలో మునుపెన్నడూ చూడనివిధంగా ఓ ప్రపంచాన్ని నిర్మించనున్నామని చిత్రబృందం తెలిపింది.
ఇక ‘ప్రళయ్’ విషయానికి వస్తే… ప్రముఖ బాలీవుడ్ నిర్మాత హన్సల్ మెహతా కుమారుడు జై మెహతా ఈ చిత్రంతో వెండితెరకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గతంలో ఆయన ‘స్కామ్ 1992’, ‘లూటేరే’ వంటి వెబ్‌సిరీస్‌లకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు.

The post ఆగష్టు నుంచి రణ్‌వీర్ ‘ప్రళయ్’ ప్రారంభం appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *