నైజీరియాలో ఐసిస్ ఘాతుకంపౌరులపై కాల్పులు… 29 మంది మృతి


అబుజా: ఆఫ్రికా దేశం నైజీరియాలో ఐసిస్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. అడమావా రాష్ట్రంలోని ఒక గ్రామంలో అమాయక ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 29 మంది పౌరులు చనిపోయారు. కాగా, ఈ ఘటనకు తామే బాధ్యులమని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎసఐఎస్) ప్రకటించింది. ఈ మేరకు తన అధికారిక టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. గోంబి స్థానిక ప్రభుత్వ ప్రాంతంలోని గుయాకు కమ్యూనిటీలో ఈ దాడి జరిగింది. నివాసితులే లక్ష్యంగా సాయుధ దుండగులు దాడులకు పాల్పడ్డారు. చీకటి పడిన తర్వాత భారీ ఆయుధాలతో ఉగ్రవాదులు గ్రామంలోకి వచ్చి కాల్పులు జరిపినట్లు సమాచారం. కాల్పుల నేపథ్యంలో ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రజలు పరుగుతీశారు. ఈ ఘటనపై అడమావా రాష్ట్ర గవర్నర్ అహ్మదు ఉమారు ఫింటిరి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే ప్రభావిత ప్రాంతాన్ని సందర్శించారు. మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఐసిస్ దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇది అత్యంత హేయమైన చర్యగా పేర్కొన్నారు. రెండు దశాబ్దాలకు పైగా నైజీరియా తీవ్ర భద్రతా సంక్షోభం ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఉత్తర ప్రాంతాల్లో ఉగ్రవాదం, అపహరణలు, సాయుధ దాడులు తరచుగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల అమెరికా కూడా నైజీరియా సైన్యానికి సహకారం అందించేందుకు పశ్చిమ ఆఫ్రికా దేశానికి సైనికులను పంపింది.

The post నైజీరియాలో ఐసిస్ ఘాతుకంపౌరులపై కాల్పులు… 29 మంది మృతి appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *