హోర్మూజ్ వెంటనే తెరవాలిఐరాస ప్రధాన కార్యదర్శి గుటెరస్ పిలుపు


న్యూయార్క్: ప్రపంచ వాణిజ్యానికి జీవనాడిగా చెప్పబడే హోర్మూజ్ జలసంధి మీదుగా నౌకల రాకపోకలను పునరుద్ధరించాలని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ పిలుపునిచ్చారు. అమెరికా`ఇరాన్ ఉద్రిక్తతల నడుమ ప్రస్తుతం హోర్మూజ్ జలసంధిలో నెలకొన్న అనిశ్చితిపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.అంతర్జాతీయ జలాల్లో నౌకాయాన స్వేచ్ఛను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి ఈ మార్గం అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. జలసంధిని మూసివేయడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అంతర్జాతీయ వాణిజ్యం సజావుగా జరిగేలా చూడాలన్నారు. నౌకల సురక్షిత ప్రయాణం అనేది కేవలం ఆర్థిక అంశం మాత్రమే కాదని మానవీయ బాధ్యతని పేర్కొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *