పెట్రోల్, డీజిల్ వెంటనే సరఫరా చేయాలి…


బంక్ వద్ద వైస్సార్సీపీ నిరసన – ప్రభుత్వం డౌన్ డౌన్ నినాదాలు..

పాల్గొన్న మాజీ మంత్రి డా. సాకే శైలజానాథ్…

విశాలాంధ్ర – నార్పల :- రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సమస్యను వెంటనే పరిష్కరించాలని మాజీ మంత్రి, నియోజకవర్గ సమన్వయకర్త డా. సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు.వైస్సార్సీపీ పార్టీ ఆదేశాల మేరకు మండలంలోని స్థానిక పెట్రోల్ బంక్ వద్ద పార్టీ శ్రేణులతో కలిసి ఆయన నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా “అసమర్థ ప్రభుత్వం డౌన్ డౌన్” అంటూ నినాదాలు చేశారు.
మాజీ మంత్రి డా. శైలజానాథ్ మాట్లాడుతూ, ఇంధనం అందుబాటులో లేకపోవడంతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి ఇంధన సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఇంధన కొరత కారణంగా రైతులు, వాహనదారులు, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద క్యూలైన్లు పెరుగుతున్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు స్పందించకపోవడం బాధాకరమని విమర్శించారు.తక్షణ చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణ రెడ్డి, ఎంపీపీ నాగేశ్వరావు,మండల కన్వీనర్ ఖాదర్ వలీ ఖాన్ , ఉప సర్పంచ్ శ్రీరాములు,కన్వీనర్లు మహేష్ రెడ్డి, ఎల్లారెడ్డి, జెడ్పీటీసీ భాస్కర్, బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు పట్నం ఫణీంద్ర, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు మంత్రి ఆంజినేయులు, ఇంటెలెక్చువల్ నియోజకవర్గ అధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డి,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ప్రభుదాస్, జిల్లా కార్యదర్శి సాకే రామాంజనేయులు, నాయకులు బాలనాగి, బయన్న, శంకర్ యాదవ్, వెంకటరామిరెడ్డి, పక్కిరెడ్డి, రంగయ్య, శివశంకర్ రెడ్డి, పప్పూరు నరసింహులు,నాగరాజు, గవ్వల ప్రవీణ్ ,శివారెడ్డి, ఎంఎస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు..

The post పెట్రోల్, డీజిల్ వెంటనే సరఫరా చేయాలి… appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *