ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కార్యక్రమం – Visalaandhra


సహాయ వ్యవసాయ సంచాలకులు లక్ష్మానాయక్
విశాలాంధ్ర ధర్మవరం;;మండల పరిధిలోని రేగాటిపల్లి గ్రామంలో ప్రకృతి వ్యవసాయం పై రైతు సేవాకేంద్ర సిబ్బందికి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అని ధర్మవరం సహాయ వ్యవసాయ సంచాలకులు లక్ష్మానాయక్ మండల వ్యవసాయ అధికారి ముస్తఫా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందులో భాగంగా ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ ,హాఫ్ మూన్ మోడల్స్,ఏ గ్రేడ్ మోడల్ గురించి వివరించడం జరిగిందన్నారు. ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ విధానంలో వర్షాభాగం పరిస్థితులు ఉన్నప్పుడు ఐదు ప్రధాన పంటలకు సంబంధించిన విత్తనాలను, బయో డైవర్సిటి కి సంబంధించిన విత్తనాలు బీజామృతం ,బంకమన్ను పొడి ,ఘనజీవామృతం , బూడిదలతో లేపనం చేసి విత్తడం జరుగుతుంది అని తెలిపారు .దీనివల్ల విత్తనాలు మొలకతే గుణం దెబ్బతినకుండా తొలకరి వర్షాలు పడినప్పుడు విత్తనాలు మొలకెత్తడం జరుగుతుందన్నారు. సంవత్సరం పొడుగునా పంటలతో భూమి కప్పి ఉంచడం జరుగుతుంది అని,హాఫ్ మూన్ మోడల్ వలన భూమి కోత గురి కాకుండా వర్షపు నీరు నిల్వ ఉంచడం జరుగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ అశ్విని, రైతు సేవ కేంద్ర సిబ్బంది ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఆదినారాయణ, హరికుమార్, ఓబులేసు, పకీరప్ప ,ఉగ్ర నరసింహ తదితరులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *