ఉరవకొండ గ్రంథాలయంలో వేసవి శిక్షణ శిబిరానికి శ్రీకారం


విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో, జిల్లా గ్రంథాలయ సంస్థ అనంతపురం నిర్వహణలో ఉరవకొండ శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణ శిబిరం మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి, సృజనాత్మకత పెంపొందించాలనే లక్ష్యంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు గ్రంథాలయ శాఖ అధికారి ప్రతాపరెడ్డి తెలిపారు. ఏప్రిల్ 28 నుంచి జూన్ 6 వరకు నిర్వహించనున్న ఈ శిబిరానికి సంబంధించిన పాంప్లెట్లను ఈ సందర్భంగా విడుదల చేశారు. బాల్యంలోనే పుస్తకాల పఠనంపై ఆసక్తి పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించినట్లు ఆయన వివరించారు. శిబిరంలో స్పోకెన్ ఇంగ్లీష్, కథలు చెప్పడం, కథా పుస్తకాల పఠనం, డ్రాయింగ్, చెస్‌తో పాటు వివిధ వినోదాత్మక కార్యకలాపాల ద్వారా విద్యార్థుల ప్రతిభను వెలికి తీయనున్నట్లు తెలిపారు. ప్రతిరోజూ ఈ శిక్షణ తరగతులు గ్రంథాలయంలోనే నిర్వహించనున్నందున, ఆసక్తి ఉన్న విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాలాక్షి, గ్రంథాలయ పాఠకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *