విశాలాంధ్ర – గణపవరం (పశ్చిమగోదావరి జిల్లా): గణపవరం మండలం సరిపల్లె గ్రామానికి చెందిన ఎం అఖిల్ శ్రీ వర్మ అనకాపల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొని జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.ఈనెల24 నుంచి కలకత్తాలో జరిగే జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు అఖిల్ శ్రీ వర్మ పాల్గొంటారు. ఈ సందర్భంగా అఖిల్ శ్రీ వర్మ శనివారం మాట్లాడుతూ జాతీయస్థాయి పోటీల్లో విజయం సాధించి గ్రామానికి మంచి గుర్తింపు తీసుకు వస్తానన్నారు. ఈ గెలుపుకు కారణం అయిన పీడీ పద్మావతి అభినందించారు.
The post జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు అఖిల్ ఎంపిక appeared first on Visalaandhra.


