సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు
విశాలాంధ్ర ధర్మవరం:; ధర్మవరం డివిజన్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల వ్యవస్థ సరిగా లేదని, ఆ వ్యవస్థను చక్కపరచాలని సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయానికి విజయవాడ ఆర్జేడి అధికారిని రోహిణికు వారు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో సిడిపిఓ గా పనిచేసిన లక్ష్మి తో పాటు ఇతర సిబ్బంది ఎన్నో అవకతవకలకు పాల్పడి అంగన్వాడీ వ్యవస్థకు చెడ్డ పేరు తేవడం జరిగిందని వారు వివరించారు. కావున వారిపై కఠిన చర్యలు తప్పకుండా తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా ధర్మవరం పట్టణము రూరల్ లలో అంగన్వాడీ కేంద్రాలను రెండు మూడు ఒకే చోట పెట్టడం వలన గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు అంగన్వాడీ కేంద్రాలకు రాలేకపోతున్నారని తెలిపారు. తద్వారా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించాల్సిన పౌష్టిక ఆహారం దూరం అయ్యే ప్రమాదం ఉన్నదని వారు గుర్తు చేశారు. కావున వెంటనే మూడు కేంద్రాలుగా ఉన్న వాటిని తొలగించి ఇంతకుముందు ఏ ప్రాంతంలో ఉన్నాయో అలాగే కొనసాగించాలని వారు తెలిపారు. తదుపరి ఆర్జెడి రోహిణి మాట్లాడుతూ గతంలో పనిచేసిన సిడిపిఓ లక్ష్మీపై, ఇతర సిబ్బందిపై తమ ఫిర్యాదును స్వీకరించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి రవికుమార్, సహాయ కార్యదర్శి శ్రీనివాసులు, ఏఐటియుసి జిల్లా నాయకులు రమణ, కిరణ్ కుమార్, చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ, జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.


