విశాలాంద్ర వలేటివారిపాలెం.(ప్రకాశం జిల్లా ) : కందుకూరు ప్రాజెక్టుపరిధిలో ని వలేటివారిపాలెం మండలం సిడిపిఓ కే ఉషారాణి సూచనల మేరకు తొమ్మిదవ తేదీ నుంచి 23వ తేదీ వరకు జరుగుతున్న పోషణ పక్వాడా ముగింపు కార్యక్రమం గరుకుపాలెం అంగన్వాడీ సెంటర్లో స్థానిక కార్యకర్త అమర జ్యోతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిదులుగా సూపర్వైజర్ సునీత మరియు స్కూల్ టీచర్, ఏఎన్ఎం పాల్గొన్నారు. 8వ పోషణ పక్వాడ కార్యక్రమం లో భాగంగా అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగినది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లి మరియు శిశు పోషణ గురించి పిల్లలకు జింక్ ఫుడ్ వల్ల కలిగే అనర్థాలను వివరించారు మార్కెట్లో లభించే ఫాస్ట్ ఫుడ్స్ కి పిల్లలను దూరంగా ఉంచాలన్నారు రెండేళ్ల వయసులో మెదడు అభివృద్ధి వేగంగా ఉంటుందన్నారు ఈ దశలో మెదడుకు అవిశ్రాంతి కలిగించే సెల్ఫోన్లను టీవీలకు పిల్లల్ని దూరంగా పెంచాలన్నారు అంగన్వాడీలలో పిల్లల్ని చేర్చడంతో కలిగే ప్రయోజనాలను వివరించారు పిల్లలలో ఆటపాట ద్వారా విద్యా బోధన పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర గురించి తల్లిదండ్రులు అమ్మమ్మ నాన్నమ్మ తాతయ్య లు వారితో సమయం హెచ్చించాలని ఇంట్లో తయారు చేసిన ఆహారమే పిల్లలకు అందుబాటులో ఉంచాలని దాంట్లో ఎన్నో పోషక విలువలు ఉంటాయని అన్నారు.బయట ఆహారం పిల్లలకు దూరంగా ఉంచాలని అవగాహన కల్పించడం జరిగింది. అనంతరం పోషణ పక్వాడా ప్రతిజ్ఞ, ర్యాలీ నిర్వహించారు.పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా చుండి అంగన్వాడీ సెంటర్లో ఒక చిన్నారికి బర్త్డే సెలబ్రేషన్స్ నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమాలకు గ్రామస్తులు,సూపర్వైజర్ సునీత,ఏఎన్ఎం స్కూల్ టీచర్ చిన్నారులు అంగన్వాడి వర్కర్ అమర జ్యోతి సుబ్బమ్మ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.


