ఎంఈఓ-1 ఇన్చార్జిగా చిన్నికృష్ణ పదవీ బాధ్యతలు స్వీకరణ


విశాలాంధ్ర ధర్మవరం ; పట్టణంలోని మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఎంఈఓ-1 గా రాజేశ్వరి దేవి ఏప్రిల్ 16 నుంచి మే నెల వరకు సెలవులో ఉన్నందున, జిల్లా డీఈవో ఆదేశాల మేరకు కదిరి ఎంఈఓ-1 గా ఉన్న చిన్ని కృష్ణను ధర్మవరం ఎంఈఓ-1 ఇన్చార్జిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం చిన్నికృష్ణ మాట్లాడుతూ విద్యా సమస్యలపై తాను అందరికీ అందుబాటులో ఉంటానని వారు తెలిపారు. వేసవి సెలవుల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఎటువంటి పరిస్థితులలో అదనపు తరగతులు నిర్వహించరాదని తెలిపారు. విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు కూడా ఎండాకాలమును దిష్టిలో ఉంచుకొని తమ పిల్లలను తమ సంరక్షణలో ఉంచుకోవాలని తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *