కొత్తగూడెం మేయర్ పీఠం సీపీఐదే


. కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం
. 22 డివిజన్లలో జయభేరి
. కూనంనేనికి రేవంత్శు భాకాంక్షలు
. రాజకీయాలకతీతంగా కార్పొరేషన్ అభివద్ధి: కూనంనేని

విశాలాంధ్ర బ్యూరో- కొత్తగూడెం: ప్రత్యర్థుల అంచనాలను తలకిందులు చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ కొత్తగూడెం తొలి కార్పొరేషన్‌పై ఎర్రజెండా ఎగరేసింది. ధన అహంకారం ప్రదర్శించిన ప్రత్యర్థులను పట్టణ ప్రజలు తిరస్కరించారు. భారత కమ్యూనిస్టు పార్టీని వెనక్కు నెట్టేయ్యాలని ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేసినప్పటికీ ఎర్రజెండాకు సంపూర్ణ మద్దతు పలికి అఖండ విజయం చేకూర్చారు. కొత్తగూడెం కార్పొరేషన్ లో 60 డివిజన్లకు గాను 22 డివిజన్లలో సీపీఐ అభ్యర్థులకు ఘన విజయం కట్టబెట్టారు. 60 డివిజన్లలో 40 కి పైగా తామే గెలుస్తామని… ఎర్రజెండాకు 10 సీట్లు కూడా రావని విర్రవీగి… ధన బలం ప్రదర్శించిన అహంకారులకు కార్పొరేషన్ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు ప్రజలతో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ప్రత్యర్థుల రాజకీయ ఎత్తుగడలను చిత్తు చేశారు. వ్యూహాత్మకంగా గడచిన పంచాయతీ ఎన్నికల తరహాలోనే కార్పొరేషన్ ఎన్నికల్లోను విజయ పరంపరను కొనసాగించారు. మొత్తంగా కొత్తగూడెం కార్పొరేషన్‌లో 60 డివిజన్లకు గాను సీపీఐ22, కాంగ్రెస్22, బీఆరఎస్8, బీజేపీ, సీపీఎం చెరొక స్థానంలో గెలుపొందగా... ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. బీఆరఎస్ అభ్యర్థులతో పాటు ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు సైతం సీపీఐకి మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉండటంతో కొత్తగూడెం కార్పొరేషన్ తొలి మేయర్ పీఠం సీపీఐకి దక్కనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తగూడెం కార్పొరేషన్‌లో అధిక స్థానాల్లో సీపీఐ విజయం సాధించినందుకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని... తమ పార్టీ పరంగా మాట్లాడి అన్ని విషయాలు సర్దుబాటు చేస్తానని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా మేయర్ పదవి విషయంలో సీపీఐకే మద్దతు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిప్యూటీ మేయర్ పదవి తమకు ఇస్తే చాలని సర్దుకుపోయే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఏవిధంగా చూసినా సీపీఐకే మేయర్ పదవి ఖరారు కానుంది. ఈ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్సీపీఐ మధ్య పొత్తు కుదురుతుందని తొలుత భావించారు.

The post కొత్తగూడెం మేయర్ పీఠం సీపీఐదే appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *