ఎంఎస్‌పీ విధానం చట్టబద్దత చేయాలిడాక్టర్ స్వామినాధన్ కమీషన్ అమలుచేయాలి : కిసాన్ మోర్చా నాయకులు జల్దీర్‌సింగ్ దలేవాల


విశాలాంధ్ర బ్యూరో ` కర్నూలు : ఎంఎస్‌పీ విధానం చట్టబద్దత చేయాలని, డాక్టర్ స్వామీనాదన్ కమీషన్ అమలు చేయాలని కిసాన్‌మోర్చానాయకులు జల్దీర్‌సింగ్ దలేవాల అన్నారు. శుక్రవారం ఎస్టీయూ భవన్‌లో ఏపీ రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి కె జగన్నాధం అద్యక్షతన జరిగిన రైతు సదస్సులో వారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కన్యాకుమారి నుండి కాశ్మీరుకు జాగతి యాత్ర చేపట్టినట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా రైతుల సమస్యల పరిష్కారం కోసం ఈయాత్ర చేపట్టినట్లు తెలిపారు. మార్చి 19న డిల్లీనగరంలోని రామ్‌లీలా మైదానంలో బహిరంగ సభ జరుగుతుందని అనంతరం కేంద్రప్రభుత్వానికి వినతిపత్రం సమర్పిచండం జరుగుతుందన్నారు.భారతదేశ అర్థికాభివది ్దకి వ్యవసాయమే ప్రదాన ఆదారమని అటువంటి దేశంలో సుమారు 4లక్ష లమంది రైతు ఆత్మహత్యకు పాల్పడటం దారుణమన్నారు. 2006 డాక్టర్ స్వామీనాధన్ కమీషన్ రైతుల సమస్యల పరిష్కారం కోసం ఒక నివేధిక అందచేసిన నాటి యుపీఏ ప్రభుత్వం నేటి ఎన్‌డీఏ ప్రభుత్వం కూడా అమలు చేయలేదన్నారు. 2014 ఎన్నికల సమయంలో డాక్టర్ స్వామీనాధన్ కమీషన్ అమలు చేస్తానని చెప్పిన మోడీ అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు అయినా నేటికి అమలు చేయలేదన్నారు. రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించకపోతే రైతులు తీవ్రంగా నష్టపోవడమే ఆకుండా అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. దీని కోసం ప్రతి రైతు పార్టీలకు ,కులాలకు మతాలకు అతీతంగా ముందుకు వచ్చి దీని కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రదాని మోడీ అమెరికా దేశంలో చేసుకున్న ఒప్పందం ప్రమాదకరమైందని ఇది రైతులకు మరణశాసనం లాంటి దన్నారు.డిల్లీ నగర శివారులో ఆందోళన సందర్భంగా ప్రభుత్వం దిగివచ్చిన ఇచ్చిన హామీలు అమలు చేయలేదని దీని కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఏర్పాడిందన్నారు. మార్చి 19న డిల్లీలో జరుగు బహిరంగ సభకు పెద్దఎత్తున తరలిరావాలని ఆయన కోరారు. అంతకు ముందు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీ రైతుసంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు పీ రామచంద్రయ్య, హరియాణా రాష్ట్ర నాయకులు అభిమన్య కోహార్, రైతుకూలీ సంఘం నాయకులు సుంకన్న, రైతుసంఘం నాయకులు బస్తిపాడు రామకష్ణారెడ్డి, పోతుల సురేష్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పంజాబ్ రాష్ట్రం ఇంద్రజిత్ సింగ్ ,పొన్నెవాల , రాజస్థాన్ రాష్ట్రము దేవరాజ్ కుమార్ ,కర్ణాటక రాష్ట్రం అరుణ్ పటేల్ , హర్యానా రాష్ట్రం సోము అలక్ , జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నాగేంద్రయ్య ,పంపన్న గౌడ్ రామకృష్ణారెడ్డి , ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు డి రాజా సాహెబ్ ,కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి తిమ్మయ్య ,డి శ్రీనివాసరావు , చింతల మహేష్, రాముడు తదితరులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *