Last Updated:
Visakhapatnam: విశాఖపట్నం విశాలాక్షినగర్‌లో యువతి మృతి కేసులో మిస్టరీ వీడుతోంది. విశాలాక్షినగర్‌లోని బి-స్క్వేర్ లాడ్జిలో శాంతికుమారి అనే యువతి సూసైడ్ చేసుకున్నట్లుగా పోలీసులకు వచ్చిన సమాచారంతో వివరాలు సేకరించారు.
Visakhapatnam: విశాఖపట్నం విశాలాక్షినగర్‌లో యువతి మృతి కేసులో మిస్టరీ వీడుతోంది. విశాలాక్షినగర్‌లోని బి-స్క్వేర్ లాడ్జిలో శాంతికుమారి అనే యువతి సూసైడ్ చేసుకున్నట్లుగా పోలీసులకు వచ్చిన సమాచారంతో వివరాలు సేకరించారు. అయితే శాంతి కుమారి పుట్టిన రోజు పార్టీ పేరుతో మృతురాలి స్నేహితులు వాసుపల్లి సాయికిరణ్, జి. యశ్వంత్, రంప లక్ష్మీ సౌజన్య, నరవ సాయికుమార్, పుచ్చ సాయికిరణ్, మణి కలిసి 118, 119 నెంబరు రూమ్స్ రెంట్‌కి తీసుకున్నారు. రాత్రి అందరూ మద్యం తాగిన సమయంలో మాటల యుద్ధం చోటు చేసుకుంది. శాంతికుమారి తనకు మరొకరితో సంబంధం ఉందని తప్పుడు ప్రచారం చేస్తోందని సాయికిరణ్ నిలదీశాడు. దీన్ని శాంతికుమారి ఖండించినప్పటికీ ఆగ్రహానికి లోనై ఆమెపై సాయికిరణ్, లక్ష్మీ సౌజన్య, యశ్వంత్ దాడి చేసారు. దాడిలో ఆమె మృతి చెందినట్లుగా తల్లి ఆరోపించారు. అయితే ఈకేసులో దాడి చేసిన తర్వాత శాంతికుమారికి ఫిట్స్ వచ్చి పడిపోయిందని ముఖంపై నీళ్లుచల్లి లేపి 118 గదిలోకి పంపించామని , శాంతికుమారి మనస్తాపానికి గురై ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్లు స్నేహితులు ఆమె తల్లిదండ్రులకు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతురాలి శరీరంపై గాయాలు, పోస్ట్‌మార్టం నివేదికతో పాటు స్నేహితుల స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మృతురాలిది జోడుగుళుళ్ల పాలెం.
విశాఖపట్నం విశాలాక్షినగర్‌లో యువతి అనుమానాస్పదమృతి కేసులో చిక్కుముడి వీడటం లేదు. పుట్టిన రోజు పార్టీ పేరుతో స్నేహితులతో కలిసి బి-స్క్వేర్ లాడ్జిలో 118, 119 నెంబరు గదులను అద్దెకు తీసుకున్న వాసుపల్లి సాయికిరణ్, జి. యశ్వంత్, రంప లక్ష్మీ సౌజన్య, నరవ సాయికుమార్, పుచ్చ సాయికిరణ్, మణితో పాటు మృతురాలు శాంతికుమారి కూడా ఉంది. అయితే రాత్రి అందరూ మద్యం తాగగా.. ఆ సమయంలో శాంతికుమారి తనకు మరొకరితో సంబంధం ఉందని తప్పుడు ప్రచారం చేస్తోందని సాయికిరణ్ నిలదీశాడు. అందుకు శాంతికుమారి తన తప్పేం లేదని చెప్పడంతో సాయికిరణ్, లక్ష్మీ సౌజన్య, యశ్వంత్ ఆమెపై దాడి చేశారు. బర్త్ డే పార్టీకి పిలిచి స్నేహితులు కొట్టడాన్ని అవమానంగా భావించి శాంతికుమారి తీవ్ర మనస్తాపంతో 118వ నెంబరు గదిలోకి వెళ్లి తలుపు వేసుకొని ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. ఎంత సేపటికీ తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన స్నేహితులు తలుపులు పగులగొట్టి చూడగా.. ఆమె ఉరివేసుకుని కనిపించడంతో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు తెలిపిన వైద్యులు నిర్ధారించారు.
అయితే ఈ విషయాన్ని శాంతికుమారి తల్లి ఆకుమర్తి రమ్యకు స్నేహితులు చెప్పడంతో ఆమె ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బర్త్ డే పార్టీ చేసుకున్న సమయంలో ఉన్న స్నేహితుల్ని విచారించారు. దాడి చేసిన తర్వాత శాంతికుమారికి ఫిట్స్ వచ్చి పడిపోయిందని ముఖంపై నీళ్లుచల్లి లేపి 118 గదిలోకి పంపించామని.. శాంతికుమారి మనస్తాపానికి గురై ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్లు చెప్పారు. స్నేహితులు తలుపులు పగులగొట్టి చూడగా ఆమె ఫ్యాన్ కి ఉరివేసుకుని కనిపించడంతో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. తన కూతురు మరణంపై కన్నీటిపర్యంతమైన మృతురాలి తల్లి స్నేహితుల దాడిలోనే చనిపోయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తోంది.
శాంతికుమారి తల్లితో కలిసి జోడుగుళ్లపాలెంలో ఉంటోంది. కొంతకాలం ఈవెంట్స్‌కు వెళ్లి ప్రస్తుతం ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే శాంతికుమారిని స్నేహితులు చంపారని తల్లి రమ్య ఆరోపించారు.. వాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బర్త్ డే వేడుకల పేరుతో పిలిచి హింసించి చంపారని ఆరోపించారు. శాంతికుమారి చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందని.. తండ్రి మరణం తర్వాత ఆమె కుటుంబానికి సంబంధించిన బాధ్యతలు చూసుకుంటుందోని తల్లి చెబుతున్నారు. శాంతికుమారి గొంతు నులిమి హత్య చేసినట్లు అనుమానం ఉందని ఆమె సోదరి కూడా ఆరోపించారు.
శాంతికుమారి మృతి కేసులో పూర్తి వివరాలను వెల్లడించారు ఏసీపీ నరహింసమూర్తి. చనిపోయిన తర్వాత రమ్య అనే మహిళ స్టేషన్‌కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారని అనుమానాస్పదమృతిగా కేసు నమోదు చేసుకొని విచారించామన్నారు. లాడ్జీలో రూమ్ రెంట్ ఇద్దరు వ్యక్తులు తీసుకున్నారు. తర్వాత ఒక అమ్మాయి కూడా వచ్చింది. అటుపై మరో ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి కూడా రావడం జరిగింది. ఇదంతా సుమారు మూడు గంటల ప్రాంతంలోనే జరిగింది. పార్టీ చేసుకున్న తర్వాత వీరి మధ్య జరిగిన గొడవలోనే శాంతి కుమారి మిగతా స్నేహితులు కొట్టారు. అయితే వాళ్లు కొట్టడంతో మరణించింది లేక వేరే కారణాలతో మరణించింద అనే విషయాలపై మరింత దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు. అంతే కాదు సీసీ కెమెరాల్లో గునపంతో పగలగొడటం కనిపించింది. కొట్టారని బాధతో సూసైడ్ చేసుకుందో తేలుస్తామన్నారు. ఈకేసులో పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. 5 అబ్బాయిలను, ఒక అమ్మాయిని రిమాండ్‌కి పంపారు పోలీసులు. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లంతా పెద్ద స్టేటస్ కలిగిన వాళ్లు కాదని అందరూ 20- 25 సంవత్సరాలు లోపు వాళ్లేనన్నారు పోలీసులు వారందరి డేటా తమ దగ్గరుందని మీడియాకు వెల్లడించారు.
Visakhapatnam,Andhra Pradesh



