Last Updated:
సరదాగా గడపడానికి వెళ్లిన చోట స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం, ఒక యువతి ప్రాణం బలితీసుకోవడానికి దారితీసింది. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ద్వారకా ఏసీపీ ఎ. నరసింహమూర్తి వెల్లడించారు.
Visakhapatnam: విశాఖపట్నంలోని ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన యువతి ఆత్మహత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. సరదాగా గడపడానికి వెళ్లిన చోట స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం, ఒక యువతి ప్రాణం బలితీసుకోవడానికి దారితీసింది. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ ఎ. నరసింహమూర్తి వెల్లడించారు.
‘రమ్య అనే మహిళ స్టేషన్ కి వచ్చి మాకు మొదటిగా ఒక ఫిర్యాదు ఇచ్చారు. ఒక లాడ్జిలో అమ్మాయి మృతి చెందింది అని ఫిర్యాదు ఇచ్చింది. మేము వెంటనే అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేశాం. లాడ్జిలో ఒక రూమ్ ను ఇద్దరు వ్యక్తులు తీసుకున్నారు. తర్వాత ఒక అమ్మాయి కూడా వచ్చింది. ఆ తర్వాత ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి కూడా రావడం జరిగింది. ఇదంతా సుమారు మూడు గంటల ప్రాంతంలోనే జరిగింది. పార్టీ చేసుకున్న తర్వాత వీరి మధ్య గొడవ జరిగింది. గొడవ తర్వాత శాంతి కుమారి కూడా మిగతా స్నేహితులు కొట్టడం జరిగింది. కొట్టడంతో మరణించింది లేదా వేరే కారణాలతో మరణించింద అని ఆమె దానిపై మరింత దర్యాప్తు చేయాల్సి ఉంది. మాకు సీసీ కెమెరాలు లో గునపంతో పగలగొడటం కనిపించింది. కొట్టారని బాధతో సూసైడ్ చేసుకుంది. 5 అబ్బాయిలను, ఒక అమ్మాయిని రిమైండ్ కు పంపడం జరిగింది. రిమాండ్ కి వెళ్లిన వారు ఎవరు కూడా పెద్ద స్టేటస్ ఉన్న వాళ్ళు కారు. మొదటిగా మాకు 100 డెయిల్ సమాచారం రావడంతో వెంటనే స్పాట్ కి వెళ్ళాం. ఇందులో ఉన్న వాళ్ళు అందరూ కూడా 20 నుంచి 25 సంవత్సరాలు లోపు ఉన్నవాళ్లే’ అని ఏసీపీ నరసింహమూర్తి తెలిపారు.
జోడుగుళ్లపాలె నివాసి అయిన ఆకుమర్తి శాంతి (27) అనే యువతికి సోషల్ మీడియా ద్వారా కొంతమందితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో, వారంతా కలిసి పార్టీ చేసుకుందామనే ఉద్దేశంతో ఈ నెల 14న విశాలాక్షినగర్‌లోని ‘బి-స్క్వేర్’ లాడ్జిలో రెండు గదులను అద్దెకు తీసుకున్నారు. ఈ బృందంలో ఐదుగురు యువకులు, ఇద్దరు యువతులు ఉన్నారు.
మద్యం సేవించిన తర్వాత వారి మధ్య పాత విషయాలకు సంబంధించి వాగ్వాదం మొదలైంది. ముఖ్యంగా, శాంతికి మరియు ఆమె స్నేహితురాలు లక్ష్మీ సౌజన్యకు మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నావంటూ శాంతి నిలదీయడంతో వివాదం ముదిరింది. ఈ క్రమంలో పుచ్చా సాయికిరణ్, లక్ష్మీ సౌజన్య, మరియు యశ్వంత్ కలిసి శాంతిపై అందరి ముందే భౌతిక దాడికి దిగారు. మిగిలిన వారు ఆమెను అసభ్య పదజాలంతో దూషించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



