Palnadu: ప్రేమ వివాహం.. సజావుగా కాపురం.. అంతలోనే భార్యపై అది పుట్టింది.. వెంటనే కాలు నరికిన భర్త.. తెగిన కాలుతో పోలీస్ స్టేషన్‌లో లొంగుబాటు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

మరింత దారుణమైన విషయం ఏమిటంటే, తెగిపడిన భార్య కాలిని ఒక సంచిలో వేసుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నిందితుడు లొంగిపోవడం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Palnadu: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై పెంచుకున్న అనుమానం ఒక నిండు సంసారంలో చిచ్చు పెట్టింది. కట్టుకున్న వాడే కాలయముడై భార్యపై గొడ్డలితో దాడి చేసి, కాలు నరికేసిన అమానుష ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. మరింత దారుణమైన విషయం ఏమిటంటే, తెగిపడిన భార్య కాలిని ఒక సంచిలో వేసుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నిందితుడు లొంగిపోవడం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది.

ప్రేమ వివాహం.. ఐదుగురు కుమార్తెలు

ఈనాడు కథనం ప్రకారం.. ముప్పాళ్ల మండలం తొండపి గ్రామం బీసీ కాలనీకి చెందిన వల్లేపు లక్ష్మయ్య, భూలక్ష్మి కొన్నేళ్ల క్రితం ఇష్టపడి వివాహం చేసుకున్నారు. వీరికి ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. లక్ష్మయ్య వ్యవసాయ పనులు చేస్తుండగా, భూలక్ష్మి కుట్టుపని చేస్తూ, అప్పుడప్పుడు కూలీ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించడంలో భర్తకు చేదోడు వాదోడుగా ఉండేది. ఐదుగురు ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఆ దంపతులు కష్టపడుతూ జీవనం సాగించేవారు.

అనుమానం పెంచిన చిచ్చు

కొంతకాలంగా భూలక్ష్మి ప్రవర్తనపై లక్ష్మయ్య అనుమానం పెంచుకున్నాడు. ఆమె ఎవరితోనైనా మాట్లాడినా, బయటకు వెళ్లినా తప్పుగా భావించేవాడు. తన పద్ధతి మార్చుకోవాలని ఆమెను పలుమార్లు హెచ్చరించాడు. ఈ విషయమై దంపతుల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. పెద్దలు రాజీ కుదిర్చినా లక్ష్మయ్య మనసులో అనుమానం మాత్రం తగ్గలేదు. గురువారం నాడు భూలక్ష్మి ఏదో పని మీద ఊరికి బయలుదేరుతుండగా, లక్ష్మయ్య మళ్ళీ ఆమెతో వాదనకు దిగాడు. ఇద్దరి మధ్య మాట మాట పెరిగి వివాహం ముదిరింది.

గొడ్డలితో ఘాతుకం

ఆవేశంతో ఊగిపోయిన లక్ష్మయ్య, ఇంట్లో ఉన్న గొడ్డలిని తీసుకువచ్చి భార్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమె తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న క్రమంలో, గొడ్డలితో బలంగా ఆమె కుడి కాలిపై వేటు వేశాడు. ఆ దెబ్బకు భూలక్ష్మి కాలు మోకాలి కింది భాగం వరకు పూర్తిగా తెగిపోయింది. రక్తపు మడుగులో ఆమె కేకలు వేస్తూ పడిపోగా, లక్ష్మయ్య ఏమాత్రం కనికరం లేకుండా ప్రవర్తించాడు. తెగిపడిన కాలిని ఒక ప్లాస్టిక్ సంచిలో వేసుకుని, నేరుగా సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. అది చూసిన పోలీసులు సైతం విస్తుపోయారు.

చికిత్స,  దర్యాప్తు

తీవ్ర రక్తస్రావంతో స్పృహ కోల్పోయిన భూలక్ష్మిని స్థానికులు గమనించి వెంటనే సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు ఆమెను మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి (GGH) తరలించారు. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయం నుండి బయటపడినట్లు, ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

సత్తెనపల్లి గ్రామీణ సీఐ కిరణ్, ఎస్సై అనిల్ కుమార్ ఘటనా స్థలాన్ని సందర్శించి ఆధారాలు సేకరించారు. లక్ష్మయ్యపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐదుగురు కుమార్తెలున్న ఆ ఇంట్లో, తండ్రి జైలు పాలు కావడం, తల్లి వికలాంగురాలు కావడంతో పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అనుమానం మనిషిని ఎంతటి మృగంగా మారుస్తుందో ఈ ఘటన మరోసారి నిరూపించింది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *