లేబర్ కోడ్ లను రద్దు చేయాలని నిరసిస్తూ ధర్నా


విశాలాంధ్ర- తాడిపత్రి: పట్టణంలోని పోలీస్ స్టేషన్ సర్కిల్లో గురువారం ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టి. రంగయ్య, సిపిఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్ మండల కార్యదర్శి నాగ రంగయ్య ఏఐటీయూసీ అంగన్వాడి యూనియన్ నాయకులు జ్యోతిలత, నాగేశ్వరి, శంకరమ్మ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన తెలిపి, సార్వత్రిక సమ్మె విజయవంతం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ లను అమలు పరచి, ఉపాధి హామీ పథకం పేరు మార్పు చేసి, నిధులలో కోత విధించి కార్మికులకు, వ్యవసాయ కూలీలకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం నోరు విప్పకుండా రాష్ట్రంలో తిరుపతి లడ్డుపై చర్చించుకోవడమే రాజకీయ నాయకులకు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కేంద్రం ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శులు శ్రీరాములు, నాగేంద్ర, రమణ, రంగస్వామి ఏఐటీయూసీ అంగన్వాడి టీచర్లు మల్లేశ్వరి, రాజేశ్వరి, శివలక్ష్మి, రమాదేవి, విజయలక్ష్మి, చంద్రకళ, రాజేశ్వరి, జయనాభి, ఆయా నిర్మల, పుట్లూరు, యల్లనూరు మండల అంగన్వాడి టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.

The post లేబర్ కోడ్ లను రద్దు చేయాలని నిరసిస్తూ ధర్నా appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *