గర్భిణీలు, బాలింతలకు పోష్టికాహారం తప్పనిసరి.. సూపర్వైజర్ సునీత


విశాలాంద్ర వలేటివారిపాలెం(ప్రకాశం జిల్లా ) : గర్భిణీలు బాలింతలు తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలని అంగన్వాడీ సూపర్వైజర్ సునీత అన్నారు గురువారం కందుకూరు ప్రాజెక్టు వలేటివారిపాలెం మండలంలో సిడిపిఓ కే ఉషారాణి సూచనల మేరకు మాలకొండ అంగన్వాడి కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్త పార్వతి అధ్యక్షతన పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూపర్వైజర్ కే సునీత హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీలు బాలింతలు ఆరోగ్యం పై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు జింక్ ఫుడ్ కు దూరంగా ఉండి అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పౌష్టికాహారాన్ని లబ్ధిదారులు ప్రతిరోజు తీసుకోవాలని తెలిపారు అలాగే వెయ్యి రోజుల సంరక్షణ బిడ్డల మెదడు అభివృద్ధిని గురించి తెలియజేశారు. గర్భవతి అయినప్పటి నుండి బేబీకి రెండేళ్లు పూర్తయ్యే వరకు తీసుకోవాల్సిన పోషకాహారం ప్రతిరోజు తినే ఆహారంలో ఉండాలని అవగాహన కల్పించారు అదే క్రమంలో టీవీ ఫోను ఎక్కువ సమయం చూసే అవకాశం ఇవ్వకుండా ఆరుబయట ఆటలా డించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ సునీత స్కూల్ టీచర్ అంగన్వాడి వర్కర్ పార్వతి హెల్పర్ సుశీల గర్భవతులు బాలింతలు గ్రామస్తులు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *