గుంతకల్లు (విశాలాంధ్ర):స్థానిక సంత మార్కెట్లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒక షాపు ముందు యాచకుడు మృతి చెందిన ఘటన బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది.వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రామాంజనేయులు (67) అనే యాచకుడు ఎండ తీవ్రత కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. మృతుడు పెద్దవడుగూరు మండలం గోపరాజుపల్లి గ్రామానికి చెందినవాడని తెలిపారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతుడి బంధువులు మృతదేహాన్ని స్వగ్రామం గోపరాజుపల్లికి తీసుకువెళ్లినట్లు పోలీసులు పేర్కొన్నారు.


