విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని శివానగర్ వీధి కి చెందిన కీ,శే పసుపులేటి పుల్లమ్మ (76 సం ) వృద్ధాప్యం తో మరణించగా విషయం తెలుసుకున్న విశ్వదీప సేవా సంఘం సభ్యులు వారి కుటుంబ సభ్యులకు నేత్రదానంపై అవగాహన కల్పించి అనంతపురం రెడ్ క్రాస్ డివై కుల్లాయప్ప కంటి రెట్రావైల్ సెంటర్ ఆధ్వర్యంలో టెక్నీషన్ జి రాఘవేంద్ర కంటి కార్నియా సేకరించడం జరిగింది అని విశ్వదీప సేవా సంఘం వ్యవస్థాపకులు కోళ్ల మొరం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు . అనంతరం వారు మాట్లాడుతూ నేత్రదానానికి సహకరించిన దాత కుమారులు పసుపులేటి వెంకటేష్, గోవిందరాజులు కోడళ్ళు లక్ష్మీదేవి, నాగమణి, రంగమ్మ కుమార్తె పార్వతి అల్లుడు వెంగముని సేవా సంఘం వారు కృతజ్ఞతలు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గాజుల సురేష్ ఉపాధ్యక్షులు టి చంద్రశేఖర్ రెడ్డి . జూజారు రఘు ,మాధవ కేశవరెడ్డి,వెంకటేష్, సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు.


