విశాలాంధ్ర -నార్పల (అనంతపురం జిల్లా) :- మండల పరిధిలోని గుంజేపల్లి గ్రామంలో కొనసాగుతున్న చెరువు నిర్మాణ పనులను మంగళవారం ప్రత్యేకాధికారి నారపరెడ్డి పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షించి, నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించేలా సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.ఈ సందర్భంగా పంచాయతీ సెక్రటరీ, సర్వేయర్ సురేష్, విఆర్ఓ పెద్దన్న, గౌతమి తదితరులు పాల్గొన్నారు. చెరువు తవ్వకం, బండ బలం, నీటి నిల్వ సామర్థ్యం వంటి అంశాలపై అధికారులు వివరాలు తెలుసుకున్నారు.గ్రామస్తులు స్వచ్ఛందంగా పాల్గొని పనులు నిర్వహిస్తున్న తీరును అధికారులు అభినందిస్తూ, ఇలాంటి సహకారం అభివృద్ధి కార్యక్రమాలకు ఎంతో దోహదపడుతుందని తెలిపారు. పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని, ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు.చెరువు నిర్మాణం పూర్తయితే భూగర్భ జలాల పెరుగుదలతో పాటు రైతులకు సాగునీటి సౌకర్యం మెరుగుపడుతుందని, గ్రామాభివృద్ధికి ఇది కీలకంగా మారుతుందని పేర్కొన్నారు.


