హైదరాబాద్: నవీన్‌రాజ్ హీరోగా, జోయెల్ జార్జ్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘తెరచాప’. ఈ నెల 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా ఇటీవల హైదరాబాద్‌లో విడుదలకు ముందస్తు వేడుకని నిర్వహించారు. కథానాయకుడు నవీన్‌రాజ్ మాట్లాడుతూ మత్స్యకారుల్లో తామూ కలిసిపోయి, వారి జీవితాల్ని పూర్తిగా అర్థం చేసుకుని రూపొందించిన సినిమానే ‘తెరచాప’ అని నవీన్‌రాజ్ శంకారపు అన్నారు.‘సహజత్వానికి పెద్దపీట వేస్తూ రూపొందించిన చిత్రమిది. మండుటెండల్లోనూ, సముద్ర తీరంలోనూ ఎన్నో సవాళ్ల మధ్య పనిచేశాం. ఎక్కువమంది నటులు ఇందులో కనిపిస్తారు. కొన్ని జీవితాల్లోని సంఘర్షణని కళ్లకు కడుతూ, ప్రేక్షకుల మనసుల్ని కదిలించేలా ఉంటుందీ చిత్రం’ అన్నారు. దర్శకుడు జోయెల్ జార్జ్ మాట్లాడుతూ కథ నచ్చి ఎంతోమంది సీనియర్ నటులు ఇందులో భాగమయ్యారనీ, కచ్చితంగా ప్రేక్షకుల్ని మెప్పిస్తామన్నారు. కథ నచ్చి చేసిన సినిమా ఇదని, కుటుంబ బలంతోనే పూర్తి చేశానన్నారు నిర్మాత. పూజ సుహాసిని, శ్రీలు ముఖ్య పాత్రలు పోషించారు. అనన్య క్రియేషన్స్ పతాకంపై కైలాష్ దుర్గం నిర్మించారు. కార్యక్రమంలో దర్శకుడు వి.సముద్ర, సినిమాలో కీలక పాత్రలు పోషించిన రాజీవ్ కనకాల, థర్టీ ఇయర్స్ పృథ్వీ, నాగమహేశ్, పుష్ప జగదీశ్, రామ్కీ పాల్గొన్నారు.
The post హదయాలను కదిలించే…‘తెరచాప’ appeared first on Visalaandhra.


