విశాలాంధ్ర ధర్మవరం;; ఆర్ డి టి ఎఫ్ సి ఆర్ ఏ పునరుద్ధరణ పట్ల సంఘ సేవకులు పోలా ప్రభాకర్ తో పాటు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆర్ డి టి సేవల అధ్యయనకర్త సత్య నిర్ధారణ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలా ప్రభాకర్తో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హిందూపురం నుండి శ్రీ ఆదిత్య వైష్ణవి సోలార్ ఎంటర్ప్రైజెస్ అధినేత లక్ష్మయ్య, కళ్యాణదుర్గం స్వచ్ఛంద కార్యకర్త, సంఘసంస్కర్త వెంకటేష్ పాల్గొనడం జరిగిందని తెలిపారు. అనంతరం ఆర్డిటి సేవల గూర్చి వారు కొనియాడారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరణ కోసం ముందుగా గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వాలకు తెలియజేయాలని ఉద్దేశంతో ధర్మవరం ఏరియాలో ధర్మపురి గ్రామంలో వెన్సెంట్ ఫెర్రర్ మెమోరియల్ హెల్త్ క్యాంపులను నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇందులో కీలకపాత్ర సోమల రాజు శివరాజు, పోలా ప్రభాకర్ , సత్య నిర్ధారణ కీలకపాత్ర వహించడం జరిగిందని తెలిపారు. ఎఫ్ సి ఆర్ ఏ విజయవంతమైన తర్వాత మేము సైతం గ్రామీణ స్థాయిలో ఫెర్రర్ జయంతి రోజున వైద్య శిబిరాలు నిర్వహించామని, హిందూపురం ఎన్జీవో వెంకటేష్, కళ్యాణదుర్గం వన్నూరు స్వామి ఎన్నో సేవలు అందించారన్నారు. అనంతరం పోలా ప్రభాకర్ను ఘనంగా సన్మానించారు.


