టీడీపీ మండల కన్వీనర్ కుళ్లాయప్ప….
విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా ):- నార్పల మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావ్ పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ బండ్లపల్లి కుళ్లాయప్ప మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావ్ పూలే అని కొనియాడారు. ఆయన జీవితమే సమాజానికి ఆదర్శమని, సమానత్వం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మహేష్ నాయుడు, మాజీ కన్వీనర్ ఎర్రినాగప్ప, క్లస్టర్ ఇంచార్జ్ పి.ఎల్. లక్ష్మీనారాయణ, గూగూడు జాఫర్, బొగ్గు నారాయణస్వామి, యూనిట్ ఇంచార్జులు పిల్లి వెంకటేష్, నాగభూషణ, తలారి హరీష్, నడిమింటి రాము, నాగార్జున, ఓబులేసు, అంకన్న, పవన్, చక్రవర్తి, అశోక్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
The post ఘనంగా మహాత్మా జ్యోతిరావ్ పూలే జయంతి వేడుకలు appeared first on Visalaandhra.


