ఇరాన్‌తో శాంతి చర్చలు.. ఇస్లామాబాద్‌కు చేరుకున్న జేడీ వాన్స్‌ బృందం


పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్‌ మధ్య కీలక శాంతి చర్చలు మరికొన్ని గంటల్లో ప్రారంభంకానున్నాయి.ఈ చర్చల్లో పాల్గొనడానికి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం తాజాగా ఇస్లామాబాద్‌కు చేరుకుంది.వాన్స్‌ బృందంలో పశ్చిమాసియా ప్రత్యేక రాయబారి స్టీవ్‌ విట్కాఫ్‌, అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జేర్డ్‌ కుష్నర్‌ కూడా ఉన్నారు.వీరు యూఎస్‌ ఎయిర్‌ఫోర్స్‌ సి-32ఏ ప్రత్యేక విమానంలో ప్రయాణించి, భద్రతా కారణాల దృష్ట్యా ఇరాన్‌ గగనతలాన్ని దాటకుండా ప్రత్యామ్నాయ మార్గంలో ఇస్లామాబాద్‌కు చేరుకున్నారు.

అత్యంత కీలకంగా చర్చలు
ఇదిలా ఉండగా, ఇరాన్‌ తరఫున విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, పార్లమెంటు స్పీకర్‌ మొహమ్మద్ బాఘర్ ఘాలిబఫ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఇప్పటికే అక్కడికి చేరుకుంది.ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో ఈ చర్చలు అత్యంత కీలకంగా మారాయి.ఇరుదేశాలు నిర్మాణాత్మకంగా చర్చలు జరిపి, యుద్ధానికి శాశ్వత పరిష్కారం కనుగొంటాయని పాకిస్థాన్‌ ఆశాభావం వ్యక్తం చేసింది.పాక్‌ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సమావేశాలు మరికొద్దిసేపట్లో అధికారికంగా ప్రారంభం కానున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *