విశాలాంధ్ర -ధర్మవరం; పట్టణంలోని భుత్వ ఉన్నత పాఠశాల ధర్మవరంలో 8వ తరగతి చదువుతున్న భాస్కర్ నాయక్ నేషనల్ మీన్ మెరిట్ స్కాలర్షిప్ పోటీ పరీక్షల్లో ఎన్నికై తన తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచాడు అని ప్రధానోపాధ్యాయులు రామక్రిష్టప్ప తెలిపారు. విద్యార్థి ఉపాధ్యాయుల యొక్క ప్రయత్నాన్ని అభినందిస్తూ నాలుగు సంవత్సరాల పాటు 12 వేల రూపాయలు వంతున స్కాలర్షిప్ రావడం విద్యార్థికి ఇచ్చిన ప్రోత్సాహాన్ని మరువలేమని తల్లిదండ్రులు తెలియజేశారు.2025-26 విద్యా సంవత్సరానికి ఎన్సిసి యూనిట్ పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ వి. నాగేంద్ర గారు సిటిఓ గా నియమించబడి 50 మంది విద్యార్థులను నైపుణ్యం తో కూడిన శిక్షణకు ఎన్నిక చేశారు అని తెలిపారు. విద్యార్థి దశలో ఎన్సిసి సి క్రమశిక్షణకు , సేవాభావాన్ని కలిగి ఉండే విధంగా విద్యార్థులను సిద్ధపరుస్తూ దేశ రక్షణలో భాగంగా భవిష్యత్తులో ద్వితీయ శ్రేణి విభాగపు రక్షణ సైనికులుగా నిలవడానికి సిద్ధం చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్సిసి యూనిట్ లో శిక్షణ ద్వారా “ఏ”సర్టిఫికెట్ పొంది విద్య ఉద్యోగాల యందు ప్రత్యేక కేటాయింపులు అవకాశం కలిగి ఉన్నందున ఈ అవకాశాన్ని పట్టణంలోని విద్యార్థులు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అడ్మిషన్ పొంది బంగారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీటీవోనాగేంద్ర తెలిపారు.అలాగే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 11మంది విద్యార్థులు బాస్కెట్ బాల్,బాల్ బాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, నెట్ బాల్ వంటి రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొని తమ ప్రతిభను చాటి పాఠశాలకు గుర్తింపు తేవడం అభినందనీయమని తెలిపారు. తదుపరి ఎన్ఎంఎంఎస్ ఎంపికైన భాస్కర్ నాయకులు హెడ్మాస్టర్ తో పాటు పిడి, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందన శుభాకాంక్షలు తెలిపారు


