ప్రజా దర్బార్ లో రోడ్లు, స్మశాన వాటికలు, నీటి సమస్యలపై విజ్ఞప్తులు


విశాలాంధ్ర -ధర్మవరం : గ్రామాల్లో సమస్యలపై టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై వచ్చిన విద్యార్థులను వారి స్వీకరించారు. ధర్మవరం టీడీపీ కార్యాలయంలో ఆయన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ గ్రామాలు, ధర్మవరం పట్టణానికి చెందిన ప్రజలు తరలివచ్చి తమ సమస్యలు తెలియజేశారు. ఇందులో ప్రధానంగా ధర్మవరం మండలం మల్కాపురం గ్రామంలో నీటి సమస్యపై గ్రామస్థులు వినతి పత్రం అందజేశారు. గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉందని.. ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించాలని కోరారు. మల్కాపురం గ్రామంలో స్మశాన వాటిక, పంచాయతీ కార్యాలయం నిర్మాణంతో పాటు తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న నీటి ట్యాంక్ డ్యామేజ్ అయిందని ఆ స్థానంలో కొత్తది నిర్మించాలని.. ఒక బోర్ వేయించాలన్నారు. వీధి లైట్లు, సీసీ రోడ్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. బడన్నపల్లి గ్రామంలో స్మశానవాటిక నిర్మించాలని గ్రామస్థులు అభ్యర్థించారు. వీధిలైట్లు లేక రాత్రి వేళ్లలో విష పురుగులు ప్రజల్ని కరిచే పరిస్థితి వస్తోందన్నారు. పోతుకుంటలో స్మశాన వాటిక మూడున్నర ఎకరాల్లో ఉన్నప్పటికీ అక్కడ ముళ్ల పొదలతో నిండిపోయి ఉందన్నారు. దీనిని శుభ్రం చేయించి కంచె వేయించాలన్నారు. అలాగే కమ్యూనిటీ భవనం నిర్మాణంతో పాటు సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలన్నారు. విద్యుత్ సరఫరా విషయంలో కూడా సమస్యలు ఉన్నాయన్నారు. ఇటు ధర్మవరం పట్టణంతో పాటు వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు వృద్ధాప్య, వికలాంగ పింఛన్లు కావాలంటూ వినతి పత్రాలు అందజేశారు. ఇటు చేనేత కార్మికులు కూడా తమకు పింఛన్ వచ్చేలా చూడాలని కోరారు. దీనిపై శ్రీరామ్ స్పందిస్తూ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎంపీడీఓతో పాటు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఆ సమస్యలు పరిష్కారమయ్యేలా చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ త్వరలోనే కొత్త పింఛన్లు అందిస్తామన్నారు. చేనేతల పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అవి కూడా వచ్చేలా చూస్తామన్నారు. దీనిపై ఎవరూ ఆందోళన చెందవద్దని శ్రీరామ్ అన్నారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన శ్రీరామ్బీబీబీబీబీబీధర్మవరం మండలానికి చెందిన ముగ్గురికి పరిటాల శ్రీరామ్ సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. నడిమిగట్టుపల్లికి చెందిన వి.రాహుల్ నాయక్ కి రూ.25.58వేలు, కుణుతూరుకి చెందిన శ్రీజ రెడ్డికి రూ.25.79వేలు, పోతుకుంటకి చెందిన అల్లం వాణికి రూ.30,51వేలు మొత్తం రూ.81.88లక్షల చెక్కులు అందజేశారు. ధర్మవరం టీడీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈసందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ అనారోగ్య కారణాలతో ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్సలు పొంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిని సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆదుకుంటున్నట్టు తెలిపారు. ఇప్పటికే ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా అన్ని ఆసుపత్రుల్లో ఆపరేషన్లు జరుగుతున్నాయన్నారు. దీనిపై ఎలాంటి అపోహలు అవసరం లేదని వారు తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *