హైదరాబాద్ – విజయవాడ మధ్య ప్రయాణించే ప్రయాణికులకు ఒక శుభవార్త. ప్రాంతీయ విమానయాన సంస్థ ఃఫ్లై 91ః (ఖీశ్రీy 91) తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య తన నూతన సర్వీసులను అధికారికంగా ప్రారంభించింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ సర్వీసును ఈరోజు శ్రీకాకుళం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు.ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ… నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ – విజయవాడ మార్గంలో ఈ అదనపు సర్వీసు ప్రయాణికులకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తుందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. సామాన్యులకు సైతం విమాన ప్రయాణాన్ని చేరువ చేయడమే లక్ష్యంగా ఈ సంస్థ తక్కువ ధరలో వేగవంతమైన సేవలను అందిస్తోందని చెప్పారు. దేశవ్యాప్తంగా టైర్-2, టైర్-3 నగరాలను అనుసంధానించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. ప్రాంతీయ కనెక్టివిటీని పెంచడం ద్వారా సామాన్యులు కూడా విమానం ఎక్కాలన్న ప్రధాని మోదీ కల నిజమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


