నేడు సార్వత్రిక సమ్మె – Visalaandhra


దేశవ్యాప్త నిరసనలకు కార్మికులు, కర్షకులు సిద్ధం

. హక్కుల పరిరక్షణకు ఐక్యపోరు
. వామపక్షాలు, బ్యాంకు ఉద్యోగులు, ప్రజా సంఘాల మద్దతు

న్యూదిల్లీ: సార్వత్రిక సమ్మెకు సర్వం సిద్ధమైంది. పది కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాల అధ్వర్యంలో గురువారం 24 గంటల పాటు నిరసనలతో దేశం మార్మోగబోతోంది. ధర్నాలు, ప్రదర్శనలతో దేశవ్యాప్త సమ్మె పెద్దఎత్తున జరగబోతోంది. నాలుగు కార్మిక కోడ్‌లు, అమెరికా`భారత్ వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా కార్మికులు, కర్షకులు పోరుబాట పట్టారు. ఐక్యంగా సమ్మెకు సమాయత్తమయ్యారు. పోరాడి సాధించుకున్న తమ హక్కులను కాలరాసేందుకు, వ్యవసాయ రంగానికి హాని చేసేందుకు తీసుకొచ్చే విధానాలను, చట్టాలను ముక్తకంఠంతో వ్యతిరేకిస్తూ… వాటి రద్దునకు సర్కారుపై ఒత్తిడి పెంచేందుకు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. ఏకపక్ష నిర్ణయాలతో సర్కారు దూకుడును అడ్డుకుంటామని ప్రకటించారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి… వాటి స్థానంలో నాలుగు కోడ్‌లు తెచ్చి ఉద్యోగ భద్రత లేకుండా చేస్తామంటే ఊరుకునేది లేదని కేంద్ర కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. యాజమాన్యాల దయకు కార్మికులు/ఉద్యోగులను వదిలేసే చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. సమ్మెకు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం), అఖిలభారత కిసాన్ సభ (ఏఐకేఎస్) సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. వామపక్షాలు, బ్యాంకుల సంఘాలు, జర్నలిస్టు సంఘాలు, ప్రజా సంఘాలు సైతం మద్దతిచ్చాయి. భారత్అమెరికా వాణిజ్య ఒప్పందం దేశ రైతాంగానికి సర్కారు ద్రోహమని ఎస్‌కేఎం ఆగ్రహం వ్యక్తంచేసింది. చౌకగా అమెరికా వ్యవసాయ ఉత్పత్తులతో దేశీయ మార్కెట్లT నింపి దేశ రైతాంగాన్ని అగాధంలోకి నెట్టివేసేలా ఈ ఒప్పందం ఉన్నదని దుయ్యబట్టింది. వాణిజ్య ఒప్పందం ద్వారా అమెరికాకు భారత వ్యవసాయాన్ని దాసోహం చేసినట్లు సర్కారును ఏఐకేఎస్ దుయ్యబట్టింది. భారతీయ విపణుýను అమెరికా పాల ఉత్పత్తులు, సోయాబీన్ నూనె, పశు దాణా, ఇతర వ్యవసాయ దిగుమతులతో నింపితే ఇక్కడ రైతులకు తీరని హాని జరుగుతుందని హెచ్చరించింది. దీనికి వ్యతిరేకంగా నిరసన గళం వినిపించేందుకు సమ్మెలో పాల్గొంటున్నట్లు తెలిపింది. బ్రిటన్, న్యూజిలాండ్, యూరోపియన్ యూనియన్‌తో చేసుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల్లో డెయిరీ ఉత్పత్తులు మినహాయించినట్లు అబద్ధాలు చెప్పి రైతాంగాన్ని వాస్తవాల నుంచి దారి మళ్లించేందుకు ప్రయత్నించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. దేశీయ వ్యవసాయ రంగం, పాడి పరిశ్రమపై ఈ ఒప్పందాలు దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని ఏఐకేఎస్ హెచ్చరించింది. అమెరికా, యూరప్ ఆర్థికంగా ప్రయోజనాలు పొందే విధంగా భారత్‌తో ఒప్పందాలు జరిగాయని పేర్కొంది. ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, హెచఎంఎస్, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, టీయూసీసీ, ఎసఈడబ్ల్యూఏ, ఏఐసీసీటీయూ, ఎల్‌పీఎఫ్, యూటీయూసీ సహా 10 కేంద్ర కార్మిÅ£ సంఘాల పిలుపునకు బ్యాంకుల సంఘాలు మద్దతిచ్చాయి. ప్రైవేటీకరణ, వేతనాల ప్రతిష్ఠంభన, సామాజిక భద్రతకు విఘాతం వంటి అంశాలపై ఆందోళన వ్యక్తంచేశాయి. ఇదిలావుంటే, కార్మికులకు, రైతులకు, ఉద్యోగులకు వ్యతిరేకంగా ప్రతిపాదించిన బిల్లుల ఉపసంహరణకు డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. గ్రామీణ ఉపాధి పథకాల కింద ఉద్యోగాల భద్రతకు హామీకి డిమాండ్ ఉంది. ముసాయిదా విత్తనాల బిల్లు, విద్యుత్ సవరణ బిల్లు, శాంతి చట్టం రద్దునకు కార్మికులు, రైతులు డిమాండ్ చేశారు. వీజీ జీ రామ్ జీ చట్టం రద్దు చేసి ఎంజీఎనఆరఈజీఏను తిరిగి అమల్లోకి తేవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏఐబీఈఏ, బీఈఎఫఐ వంటి బ్యాంకుల సంఘాలు సైతం సమ్మెకు మద్దతు ఇవ్వడంతో బ్యాంకింగ్ కార్యకలాపాలకు విఘాతం కలగనుంది. సమ్మె కారణంగా కేరళ, కర్నాటక, ఒడిశా తదితర రాష్ట్రాల్లో విద్యా సంస్థలు మూసివేయనున్నారు. దేశమంతటా రవాణా కూడా స్తంభించబోతోంది. కాగా, సమ్మెలో సుమారు 30 కోట్ల మంది కార్మికులు భాగస్వాములు కాబోతున్నారని, దేశంలోని 600 జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు జరగనున్నాయని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్ కౌర్ తెలిపిన విషయం విదితమే. ప్రభుత్వ ఆర్థిక, వ్యవసాయ, కార్మిక విధానాలు నష్టం కలిగిస్తున్నాయనే కార్మికులు, రైతులు, ఉద్యోగులు సమ్మె బాట పట్టినట్లు కార్మికరైతు నాయకులు స్పష్టం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *