ప్రపంచ శాంతికి ఇది గొప్ప దినం


డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన అమెరకా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తాజాగా ఈ పరిణామాన్ని ప్రపంచ శాంతికి అతిపెద్ద రోజుగా అభివర్ణించారు. ఇరాన్‌తో పాటు ప్రపంచ దేశాలన్నీ శాంతిని కోరుకుంటున్నాయని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ‘పశ్చిమాసియాలో ఇది సువర్ణాధ్యాయం కాబోతోంది. ఇది జరగాలని ఇరాన్ కోరుకుంటోంది. వారికి ఇక చాలు అనిపించింది. అలాగే, ప్రపంచం మొత్తం కూడా యుద్ధం ఆగిపోవాలనే కోరుకుంటోంది. హోర్మూజ్ జలసంధిలో పేరుకుపోయిన ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడంలో అమెరికా సహాయం చేస్తుంది. ఎన్నో సానుకూల చర్యలు ఉంటాయి. భారీగా డబ్బు సంపాదించవచ్చు. ఇరాన్ పునర్నిర్మాణ ప్రక్రియను ప్రారంభించవచ్చు. అన్ని రకాల నిత్యావసర వస్తువులను లోడ్ చేసుకుని, అంతా సజావుగా సాగుతోందో లేదో చూస్తూ మేం అక్కడే వేచి ఉంటాం. అది జరుగుతుందని నాకు గట్టి నమ్మకం ఉంది. అమెరికాలో మనం అనుభవిస్తున్నట్లే, ఇది పశ్చిమాసియాకు స్వర్ణయుగం కావచ్చు’ అని ట్రంప్ పోస్ట్‌లో రాసుకొచ్చారు. అయితే ీVAర్మూజ్‌లో అమెరికా పాత్రపై కచ్చితమైన వివరాలను ఆయన వెల్లడించలేదు. కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం ీVAర్మూజ్ జలసంధి గుండా వెళ్లే ఓడల నుంచి ఇరాన్ ఫీజు వసూలు చేస్తుందని ఆ డబ్బును తన దేశ పునర్నిర్మాణానికి వాడుకుంటుందని కథనాలు వెలువడ్డాయి.
లెబనాన్‌కు కాల్పుల విరమణ వర్తించదు: నెతన్యాహు
ఇరాన్‌తో కాల్పుల విరమణకు అంగీకరించినప్పటికీ లెబనాన్‌లోని హెజ్బుల్లా గ్రూపునకు ఈ ఒప్పందం వర్తించదని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. హెజ్బుల్లా నుంచి ముప్పు పూర్తిగా తొలగిపోయి, తమ ఉత్తర సరిహద్దులు సురక్షితమయ్యే వరకు సైనిక చర్యలు కొనసాగుతాయని ఆయన తేల్చి చెప్పారు. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు తగ్గించే లక్ష్యంతో అమెరికా మధ్యవర్తిత్వంతో రూపొందించిన కాల్పుల విరమణ ఒప్పందానికి నెతన్యాహు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. సుదీర్ఘ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై చూపుతున్న ప్రభావం దృష్ట్యా అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు ఇజ్రాయిల్‌పై ఒత్తిడి తీసుకువచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌తో ప్రత్యక్ష దాడులను నిలిపివేసేందుకు నెతన్యాహు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఒప్పందం తమ భద్రతకు అడ్డంకి కాదని నెతన్యాహు పేర్కొన్నారు. ‘ఇరాన్‌తో ఒప్పందం అంటే మా భద్రత విషయంలో రాజీ పడటం కాదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఒకవైపు శాంతి చర్చలకు సానుకూలంగా ఉన్నప్పటికీ, మరోవైపు హెజ్బుల్లా స్థావరాలపై దాడులకు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) సర్వసన్నద్ధంగా ఉందని హెచ్చరించారు. గత కొన్ని నెలలుగా ఇరాన్ మద్దతున్న హెజ్బుల్లా, ఇజ్రాయిల్‌పై క్షిపణి దాడులు చేస్తుండగా, ఇజ్రాయిల్ లెబనాన్‌లోని వారి స్థావరాలపై ప్రతిదాడులు చేస్తోంది. తాజా పరిణామంతో ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య ప్రత్యక్ష పోరుకు తాత్కాలికంగా తెరపడే అవకాశం ఉన్నా.. లెబనాన్ సరిహద్దుల్లో మాత్రం ఉద్రిక్తతలు కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *