చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం;; చేనేతల న్యాయమైన డిమాండ్ల సాధనకై ఫిబ్రవరి 22వ తేదీన చలో మంగళగిరి-చేనేత గర్జన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చేనేత ఐక్య కార్యచరణ కమిటీ రాష్ట్ర నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణం లో శమి నారాయణ స్వామి గుడి నందు ఆంధ్రప్రదేశ్ చేనేత ఐక్య కార్మిక సంఘాల కార్యాచరణ కమిటీ ఆధ్యర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర నాయకులు బండారు ఆనంద్ ప్రసాద్, పిల్లలమర్రి నాగేశ్వరరావు, సంకరపు జయశ్రీ మాట్లాడుతూ ఫిబ్రవరి 22వ తేదీ మంగళగిరి నందు రాష్ట్రవ్యాప్త చేనేత కార్మిక సంఘాలు, సహకార సంఘాల, ఆధ్వర్యంలో జరగబోయే “చేనేత గర్జన” మహా సభకు వస్త్ర వ్యాపారులు మాస్టర్ వీవర్స్ చేనేత కార్మికులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. చేనేత కార్మికులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆగష్టు 7చేనేత దినోత్సవం రోజున ఇచ్చిన హామిలు గత ప్రభుత్వo ఇస్తున్న నేతన్న నేస్తం పథకం 24 వేల రూపాయలను ఈ ప్రభుత్వం 25 వేలకు పెంచి ఇస్తానని హామీ ఇచ్చిందని కానీ ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదని, నేతన్న భరోసా పథకాన్ని వెంటనే అమలు చేయాలని వారి డిమాండ్ చేశారు. ప్రతి చేనేత కార్మికునికి 50 ఏళ్లకు పెన్షన్ సౌకర్యం కల్పిస్తా నని హామీ ఇచ్చారని, ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తామని చెప్పారని, ఇప్పటివరకు కార్యాచరణ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత వస్త్ర ఉత్పత్తికి వినియోగించే చిలపనూలు జరీపట్టు, రంగులు,రసాయనాలు, మరియు చేనేత వస్త్రాల పైన భారత రాజ్యాంగా అధికరణ ఆర్టికల్ 43 కి వ్యతిరేకంగా విధించిన జీఎస్టీని తక్షణమే రద్దు చేయాలని వారు తెలిపారు. రౌంటేబుల్ సమావేశ అనంతరం వస్త్ర చేనేత గర్జన కు సంబందించిన గోడ పత్రికలు, కరపత్రాలు విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో వస్త్ర వ్యాపార సంఘం నాయకులు గిర్రాజు రవి,పోలావెంకటనారాయణ,యుగంధర్,బుడగ వెంకటనారాయణ, వెంకటనారాయణ,యుగంధర్,పల్లా నవీన్, గిర్రాజు శశి,దాసరి శ్రీనివాసులు, గడ్డం పార్టసారధి,కోనేటి వెంకటేష్, భాస్కర, బాషా, హరి,చెన్నంపల్లి శ్రీనివాసులు, సంకారపు రాజ, జల్లా కార్తీక్, వస్త్ర వ్యాపార సంఘం నాయకులు, చేనేత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


