విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా): మండలంలోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్ష్యాలను నిర్దేశించిన సమయానికి చేరుకోవాలని ఎంపీడీఓ బి. విజయలక్ష్మి సిబ్బందిని ఆదేశించారు. బుధవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లతో వారపు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండలంలో
గ్రామాల్లో ఉపాధి అవసరమైన వారిని గుర్తించి, ప్రభుత్వం కల్పిస్తున్న పనుల గురించి వారికి వివరించి, వారు పనికి వచ్చేలా (లేబర్ మొబలైజేషన్)పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇటీవల మన రాప్తాడు మండలం 32వ స్థానంలో ఉండేదని, ప్రస్తుతం
ప్రతి గ్రామంలోనూ ఉపాధి పనులకు వచ్చే కూలీల సంఖ్యను పెంచి, మండల టార్గెట్‌కు అనుగుణంగా పనులు జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన మొబైల్ యాప్ పనితీరు, దాని ద్వారా హాజరు నమోదు ప్రక్రియపై సిబ్బందికి దిశానిర్దేశం చేస్తూ, సాంకేతిక అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కూలీలకు కల్పించాల్సిన సౌకర్యాలు, పనుల నాణ్యత విషయంలో రాజీ పడకూడదని, క్షేత్రస్థాయిలో సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కోరారు.
మండల అభివృద్ధిలో ఉపాధి హామీ పథకం కీలకమని, సిబ్బంది సమన్వయంతో పనిచేసి రాప్తాడు మండలాన్ని జిల్లాలోనే ముందు వరుసలో నిలపాలని ఆమె పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏపీవో సావిత్రి, ఈసీ మురళి, టెక్నికల్ అసిస్టెంట్లు మరియు ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.


