విశాలాంధ్ర ధర్మవరం;; మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ వద్ద సిఐటియు నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లాఉపాధ్యక్షులు అయూబ్ ఖాన్, మున్సిపల్ కార్మిక సంఘం పట్టణ అధ్యక్ష ,కార్యదర్శులు మేకలబాబు, ముకుంద, కోశాధికారి లక్ష్మీ ఓబులేసు, రెగ్యులర్ కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు శ్రీరాములు, పుల్లన్న, మాట్లాడుతూ మునిసిపల్ పారిశుద్ధ్య విభాగానికి చెందిన అప్కాస్ కార్మికులకు మార్చి నెలకు సంబంధించిన జీతాన్ని ఇవ్వాలని, చనిపోయిన కార్మికుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు, తల్లికి వందనంతో సహా, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయాలని, సమాన పనికి సమాన వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య వినతి పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు బి,ప్రసాద్, పోకిరివెంకటేష్, సూరి, శీనా, రమేష్, చంద్ర, మహిళా కార్మికులు పాల్గొన్నారు.


