ఇరాన్‌ను వెంటనే వీడండి


: భారతీయులకు కేంద్రం మరోసారి కీలక అడ్వైజరీ

ఇరాన్ దేశంలోని భారతీయులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక అడ్వైజరీ జారీ చేసింది. ఆ దేశం నుంచి వెంటనే బయటపడాలని భారత పౌరులకు సూచించింది. ఈ మేరకు ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం ‘ఎక్స్’ వేదికగా పోస్టును పంచుకుంది. కేంద్ర ప్రభుత్వం సూచనల ఆధారంగా ఇరాన్ నుంచి బయటపడాలని కోరింది.ఇరాన్‌లోని రాయబార కార్యాలయాన్ని సంప్రదించకుండా లేదా వారితో సమన్వయం చేసుకోకుండా అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోకి రావొద్దని హెచ్చరించింది. ఈ మేరకు రాయబార కార్యాలయం అత్యవసర సమయంలో సంప్రదించేందుకు ఫోన్ నెంబర్లను ఇచ్చింది. +989128109115; +989128109109; +989128109102; +989932179359, మెయిల్ ఐడి – cons.tehran@mea.gov.in ను షేర్ చేసింది.అమెరికా, ఇరాన్ దేశాలు రెండు వారాలు కాల్పుల విరమణకు అంగీకరించిన విషయం తెలిసిందే. నిన్న ఇరాన్‌కు ట్రంప్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో నిన్న కూడా కేంద్రం అడ్వైజరీ జారీ చేసింది. అనవసర ప్రయాణాలు మానుకోవాలని, ఇళ్లలోనే ఉండాలని, అన్ని విద్యుత్, సైనిక స్థావరాలు, బహుళ అంతస్థుల భవనాలకు దూరంగా ఉండాలని సూచించింది. తాజాగా కాల్పుల విరమణ నేపథ్యంలో మరోసారి అడ్వైజరీ జారీ చేసింది.

The post ఇరాన్‌ను వెంటనే వీడండి appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *