తిరుపతి పట్టణ పరిధిలోని పాత్రికేయులు సద్వినియోగం చేసుకోగలరు
జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి, ఏప్రిల్ 06: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో తిరుపతి పట్టణ పరిధిలో అక్రెడిటేషన్ కలిగిన పాత్రికేయులకు ఈ నెల 07 నుండి 10 వరకు అమరా ఆసుపత్రి, కరకంబాడి వారి సౌజన్యంతో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్ట్ ల ఆరోగ్య భద్రతకు పెద్ద పేట వేస్తున్నదని, ఇందులో భాగంగా అమరా ఆసుపత్రి నందు తిరుపతి పట్టణంలోని జర్నలిస్ట్ లు, తమ కుటుంబ సభ్యులకు మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మెడికల్ క్యాంప్ ఉ.8.00 గం.లకు ప్రారంభం అవుతుందని, వైద్య పరీక్షలకు హాజరగు వారు ఆన్ లైన్ నందు షేర్ చేసిన అప్లికేషన్ ఫారంలో రిజిష్ట్రేషన్ చేసుకోవాలన్నారు. దీనితో పాటు వాట్స్ అప్ నందు షేర్ చేసిన పిడిఎఫ్ అప్లికేషన్ ఫారంను నింపి ఆసుపత్రి నందు ఐ&పిఆర్ సిబ్బందికి సమర్పించాలని తెలిపారు. రక్త పరీక్షలు (డయాబెటీస్), లిపిడ్ ప్రొఫైల్ పరీక్షల కోసం, ఖాళీ కడుపుతో రావాలని, అలాగే గతంలో చేయించుకున్న వైద్య పరీక్షల రిపోర్ట్ ఏవైనా ఉంటే వాటిని తీసుకురావాలని సూచించారు. తదుపరి వివరాల కొరకు అమర ఆసుపత్రి సిబ్బంది హేమకుమార్ 8121444424, ఐ అండ్ పి ఆర్ సిబ్బంది లక్ష్మీనారాయణ 9989349785 ను సంప్రదించగలరు.
ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నందు నిర్వహించు పరీక్షలు:
- CBC
(Hb, PCV, RBC, MCV, MCH, MCHC, RDW, WBC, Platelet) - FBS (Fasting Blood Sugar)
- Creatinine
- ECG
- Lipid Profile
(Total cholesterol, Triglycerides, HDL, LDL, VLDL) - Liver Function Tests (LFT)
(Total bilirubin, Direct bilirubin, SGOT, SGPT, ALP, Total protein, Albumin, Globulin) - Free Consultation. (Cardiology, Dental, ENT, Obstetrics & Physician)
- 25% discount on any additional tests required.


