విశాలాంధ్ర నందిగామ:-రాష్ట్రస్థాయి మాస్టర్ స్విమ్మింగ్ పోటీలలో నందిగామ కాకతీయ హెల్త్ క్లబ్ స్విమ్మింగ్ అకాడమీ క్రీడాకారులు తమ సత్తా చాటి 11 పథకాలను దక్కించుకున్నారని కాకతీయ హెల్త్ క్లబ్ చైర్మన్ కాపా రవీంద్రనాథ్ తెలిపారు స్విమ్మింగ్ కోచ్ గోపీచంద్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు అలాగే విజయతలగా పథకాలను గెలుచుకున్న వారికి పేరుపేరునా ఆయన ధన్యవాదాలు తెలిపారు ఆదివారం జగ్గయ్యపేట లో జరిగిన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మాస్టర్ స్విమ్మింగ్ పోటీలకు జగ్గయ్యపేట డ్రీమ్ అసోసియేషన్ వారు మున్సిపల్స్ స్విమ్మింగ్ పూల్ లో ఘనంగా పోటీలను నిర్వహించారు ఈ పోటీలలో 20 సంవత్సరాల నుండి 90 సంవత్సరాల వరకు వయస్సు గల క్రీడాకారులు 19 జిల్లాల నుండి పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జగ్గయ్యపేట,నందిగామ శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య, తంగిరాల సౌమ్య, కల్చరల్ చైర్ పర్సన్ తేజస్విని సమక్షంలో గెలుపొందిన వారికి బహుమతులను ప్రధానం చేశారు….


