విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని కళాజ్యోతిలో స్వర్గీయ పద్మశ్రీ గంటసాల వర్ధంతి వేడుకలు కళాజ్యోతి కమిటీ కార్యదర్శి బాలకొండ రామకృష్ణ, కార్యవర్గ సభ్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా జిల్లా టూరిజం ఆఫీసర్ జయరాం, కళాజ్యోతి అధ్యక్షులు కుంటివల నారాయణ, జాతీయ రహదారులు అనంతపురం సూపర్డెంట్ ఇంజనీర్ సంజీవ రాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రపంచంలోనే ఘంటసాల పాటలు నేడు ఇంకను ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. అటువంటి ఘంటసాల వర్ధంతి వేడుకలను మనం జరుపుకోవడం నిజంగా సంతోషకరంగా ఉందని తెలిపారు. ఎంతోమంది కళాకారులు వారికి అభిమానంగా ఉంటూ, వారి అడుగుజాడల్లో నడుస్తున్నారని తెలిపారు. వారు పాడిన పాటలను నేడు స్మరించుకుంటూ కళాకారుల ద్వారా వినడం ఓ గొప్ప అదృష్టమని తెలిపారు. ప్రముఖ గాయకులు అంగడి శివప్రసాద్ కాకినాడ వారి బృందం చే ఘంటసాల పాటల కచేరి నిర్వహణకు ప్రేక్షకులు రావడం సంతోషకరమని తెలిపారు. గాయనీ గాయకులు కాకినాడ నుండి అంగడి శివప్రసాద్, గుంతకల్లు నుండి వీరలక్ష్మి, అనంతపురం నుండి జ్యోతి పాడిన పాటలు ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేసిందని తెలిపారు. తదుపరి గాయనీ గాయకులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జగ్గా వేణుగోపాల్, సహకార దర్శి అశ్వత్ నారాయణ, గౌరవ సలహాదారుడు సింగనమల రామకృష్ణ, కార్యవర్గ సభ్యులు రాంప్రసాద్, సోమశేఖర్, ఓ వి ప్రసాద్, రామన్న తదితరులు పాల్గొన్నారు.


