విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (అనంతపురం)15 వ స్నాతకోత్సవ వేడుకలు ఎన్టీఆర్ ఆడిటోరియంలో సోమవారం కన్నుల పండుగగా వేడుకలను నిర్వహించారు. గౌరవ డాక్టరేట్’మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా’ టెస్సీ థామస్‌కు కు ఏపీ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ అందజేశారు, అనంతరం గవర్నర్ 24 మంది గోల్డ్ మెడలు సాధించిన విద్యార్థులకు మెడల్స్ ను సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం విశ్వవిద్యాలయం సాధించిన అభివృద్ధిపై వీసీ ఆచార్య హెచ్ సుదర్శన్ రావు వివరించారు. రిజిస్ట్రార్ ఆచార్య ఎస్ కృష్ణయ్య, పరీక్షల విభాగాధిపతి నాగ ప్రసాద్ నాయుడు, డైరెక్టర్ భానుమూర్తి, దుర్గ ప్రసాద్, అనుబంధ కళాశాల ప్రిన్సిపల్స్, ప్రజా ప్రతినిధులు, పాలకమండలి సభ్యులు, జిల్లా యంత్రాంగం , రాజకీయ నేతలు పాల్గొన్నారు.


