బంగ్లాదేశ్ సరిహద్దు జలాల్లోకి మొసళ్లు.. పాములు


చొరబాటుకు చెక్ పెట్టే కొత్త ఆలోచనపై బీఎస్‌ఎఫ్
దేశ సరిహద్దుల వద్ద చొరబాట్లు, అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు బీఎస్‌ఎఫ్ కొత్త వ్యూహాలపై దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా బంగ్లాదేశ్ సరిహద్దు వెంట ఉన్న నదీ పరివాహక ప్రాంతాల్లో పాములు, మొసళ్లను వదిలే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ ఆలోచన అమలు సాధ్యతపై అధ్యయనం చేయాలని బీఎసఎఫ్ తన ప్రాంతీయ కార్యాలయాలకు సూచనలు పంపినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ ప్రతిపాదనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే, ఈ ప్రణాళిక ఇంకా ప్రారంభ దశలోనే ఉందని అధికారులు చెబుతున్నారు.
పాములు, మొసళ్లను సేకరించడం నుంచి మొదలుకుని, అవి నదీ తీర ప్రాంత ప్రజలపై చూపే ప్రభావాన్ని సమగ్రంగా అధ్యయనం చేయాల్సి ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

ఈ ప్రాంతంలో వరద ముప్పు
భారత్‌కు బంగ్లాదేశ్, పాకిస్థాన్ దేశాలతో ఉన్న సరిహద్దుల్లో భద్రతా బాధ్యతలు బీఎస్‌ఎఫ్ దే.
తూర్పు సరిహద్దు వెంట అక్రమ రవాణా,చొరబాటు ఘటనలు పెరుగుతున్నాయనే ఆందోళన కేంద్రానికి ఉంది.ఈ సమస్యలను అరికట్టేందుకు పలు మార్గాలను పరిశీలిస్తున్నప్పటికీ,ఈ ప్రాంతంలో వరద ముప్పు ఎప్పటికప్పుడు ఉండటం పెద్ద సవాలుగా మారింది.దీంతో అక్కడ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం సులభం కావడం లేదు. అంతేకాక,సరిహద్దు ప్రాంతాల్లో జనసాంద్రత కూడా అధికంగా ఉంది.ఈ నేపథ్యంలో ఫెన్సింగ్‌కు ప్రత్యామ్నాయంగా సరీసృపాలను వినియోగించాలనే ఆలోచన ఉన్నప్పటికీ,ఇది స్థానిక ప్రజలకు ప్రమాదకరంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి.ముఖ్యంగా వరదల సమయంలో పాములు,మొసళ్లు నివాస ప్రాంతాలకు చేరే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఈ అన్ని అంశాలను ప్రస్తుతం సమగ్రంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *