రేపే డెడ్‌లైన్.. ఒప్పందం చేసుకోకుంటే ఇరాన్‌ను నాశనం చేస్తామన్న ట్రంప్


అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఇరాన్‌తో ఒప్పందం కుదరకపోతే అక్కడున్న ప్రతీదాన్నీ పేల్చేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక జారీ చేశారు. కాల్పుల విరమణ, హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం లక్ష్యంగా పాకిస్థాన్, ఈజిప్ట్, టర్కీ మధ్యవర్తిత్వంతో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గల్ఫ్ ప్రాంతంలో కలకలం రేపింది. మంగళవారం నాటికి ఒప్పందం జరగకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన అల్టిమేటం ఇచ్చారు.ఁమంగళవారం ఇరాన్‌లో పవర్‌ ప్లాంట్లు, బ్రిడ్జిల దినోత్సవం అవుతుంది. హర్మూజ్ జలసంధిని తెరవండి, లేదంటే నరకంలో బతుకుతారు. చూస్తూ ఉండండి! అంటూ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఃట్రూత్ సోషల్ఃలో తీవ్ర పదజాలంతో పోస్ట్ చేశారు. ఇరాన్ మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. పాలనతో విసిగిపోయిన ఇరాన్ పౌరులు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే ఇలాంటి చర్యలను సమర్థిస్తారని ట్రంప్ అభిప్రాయపడ్డారు.ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ ఘలీబాఫ్ మాట్లాడుతూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆదేశాలతో ట్రంప్ అమెరికాను సజీవ నరకంలోకి లాగుతున్నారని ఆరోపించారు. ఈ ప్రమాదకరమైన ఆటను ఆపాలని హెచ్చరించారు.

మరోవైపు, తెరవెనుక దౌత్యపరమైన చర్చలు కొనసాగుతున్నాయి. అమెరికా రాయబారులు జారెడ్ కుష్నర్, స్టీవ్ విట్కాఫ్ ఇరాన్ విదేశాంగ మంత్రితో నేరుగా టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారా సంప్రదింపులు జరుపుతున్నట్లు ట్రంప్ వెల్లడించారు. అయితే, మంగళవారం గడువు సమీపిస్తున్నా చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది.

The post రేపే డెడ్‌లైన్.. ఒప్పందం చేసుకోకుంటే ఇరాన్‌ను నాశనం చేస్తామన్న ట్రంప్ appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *