విశాలాంధ్ర ధర్మవరం;; శ్రీ సత్య సాయి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు, ప్రిన్సిపాల్సు కలిసి డి ఐ ఈ ఓ కు కళాశాల పనివేళ పునరుద్ధనకు సంబంధించినటువంటి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని వారు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం నుండి కళాశాల యొక్క సమయం ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు పని వేళలు పెట్టడం వలన విద్యార్థులు మరియు సిబ్బందికి అనేక ఇబ్బందులను కలిగిస్తున్నాయని వారు తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులు రవాణా సౌకర్యాల లేమి కారణంగా సాయంత్రం ఆలస్యంగా ఇంటికి చేరుకోవాల్సి రావడం వల్ల భద్రతా సమస్యలు ఎదురవుతున్నాయని వివరించడం జరిగిందన్నారు.అదేవిధంగా, సాయంత్రం 4:00 నుండి 5:00 గంటల మధ్య విద్యార్థుల హాజరు చాలా తక్కువగా ఉండటం వల్ల ఆ అదనపు సమయం ప్రయోజనకరంగా లేదని తెలిపారు. మహిళా సిబ్బంది కూడా ఈ సమయ మార్పుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు.
ఈ నేపథ్యంలో, మునుపటిలాగే 2026 జూన్ నెల నుండి మొదలయ్యే తరగతులు ఉదయం 9:30 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు పని వేళలను పునరుద్ధరించాలని వారు విజ్ఞప్తి చేశారు.


