పాస్ పుస్తకాల పంపిణీలో వైసిపి నాయకులతో రెవెన్యూ అధికారులు…


విశాలాంధ్ర నందిగామ : కూటమి ప్రభుత్వంలో రెవెన్యూ అధికారులు ప్రతిపక్ష నాయకుల అడుగులకు మడుగులు ఒత్తుతున్నారని తెలుగుదేశం గ్రామ మాజీ సర్పంచ్ జిల్లేపల్లి మధుబాబు పేర్కొన్నారు మండల పరిధిలోని రుద్రవరం గ్రామంలో శనివారం జరిగిన పాస్ పుస్తకాల పంపిణీ కి సంబంధించిన ఈ కేవైసీ కార్యక్రమం మరియు పంపిణీ కార్యక్రమంలో స్థానిక అధికార పార్టీ నాయకులకు రెవెన్యూ అధికారులు జలక్ ఇచ్చారు స్థానిక వైసీపీ నాయకులు జిల్లేపల్లి రాముతో కలిసి వారు ఈ కార్యక్రమాలను కొనసాగించడం పై అధికార పార్టీ నాయకులు కన్నెర్ర చేశారు వీఆర్వో పాపారావు, ఖాసిం లను వారు ప్రశ్నించగా ఎటువంటి సమాధానం చెప్పకుండా వారి మాటలను పట్టించుకోకుండా ప్రతిపక్ష నాయకులతో కలిసి అధికారికంగా కార్యక్రమం నిర్వహించటం చర్చనీయంశం గా మారింది అంతేకాకుండా మధ్యాహ్నం గ్రామ సెక్రెటరీ రూమ్ లో సదరు వ్యక్తితో కలిసి మాంసా కృతులతో కలిసిన భోజనం చేయటం వారి వాదనకు బలం చేకూరుతుంది దీనిపై స్థానిక రెవిన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి గ్రామంలో పాస్ పుస్తకాల పంపిణీలో భారీగా చేతులు మారుతున్నాయని అటువంటి చర్యలకు పాల్పడిన అధికారులతో పాటు గ్రామంలో మధ్యవర్తిగా ఉంటున్న ప్రతిపక్ష నాయకులు రాము పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు స్థానిక మండల తాసిల్దార్,రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ మేరకు చరవాణి ద్వారా సంప్రదించగా చరవాణి కు వారు అందుబాటులోకి రాకపోవడం జరిగింది…



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *