విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని చిన్నతుంబళం గ్రామంలో సర్పంచ్ పదవి ముగీయడంతో సర్పంచు బసమ్మ, ఉప సర్పంచ్ సంగీత, వార్డు సభ్యులు మంజునాథ్, హరిజన మరియమ్మ, తెలుగు రమేష్, చాకలి ఈరమ్మ, మాల శివ, మంగలి నర్సమ్మలను శనివారం టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షులు తిక్కారెడ్డి కుమారుడు దివాకర్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, సీనియర్ నాయకులు సిద్దప్ప ధని, వీరేష్ గౌడ్ లు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్పంచ్ బసమ్మ తన పదవీ కాలంలో గ్రామంలో తాగునీటి సమస్య, వీధి దీపాలు, డ్రైనేజీ వ్యవస్థ, పారిశుధ్యం తదితర సమస్యలను పరిష్కరిస్తూ గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడపారన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అందరూ ఐక్యంగా ఉండి టీడీపీ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాగునీటి సంఘం అధ్యక్షులు చాకలి నారాయణ, చాకలి చంద్రశేఖర్, విద్యాకమిటీ చైర్మన్ వెంకటేష్, నాయకులు గోసలి తిక్కయ్య, హుస్సేన్, బద్రి, మాల శివ, మాల రవి, కోడిగుడ్ల నజీర్, కందనాతి మహేష్ తదితరులు పాల్గొన్నారు.


