ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలలో ముందస్తు అడ్మిషన్లు అరికట్టాలి


ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నరసింహమూర్తి, శేషం మహేంద్ర
విశాలాంధ్ర ధర్మవరం;; ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో ముందస్తు అడ్మిషన్లను అరికట్టాలని, ఆన్లైన్ పేరుతో పాఠ్యపుస్తకాలు అమ్మకాలకు అడ్డుకట్ట వేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నరసింహమూర్తి, శేషం మహేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మవరం పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ముందస్తు అడ్మిషన్లకు ఎర్ర లేపుతూ విద్యార్థుల తల్లిదండ్రులకు మాయమాటలు చెబుతూ అడ్మిషన్లు చేపడుతున్నారని వారు మండిపడ్డారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాఠశాల అడ్మిషన్లు జూన్ నెలలో ప్రారంభం కావాల్సి ఉంటే కానీ ధర్మవరం పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యులు అక్కడ పని చేస్తున్నటువంటి టీచర్లను ఏర్పాటు చేస్తూ వాళ్లకు టార్గెట్లు ఇస్తూ రోజుకు మీరు టార్గెట్ ఇస్తూ, అడ్మిషన్లు చేయాలని హుక్కం జారీ చేస్తున్నారని మండిపడ్డారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే రేపు సంవత్సరానికి సంబంధించిన పుస్తకాలు ఇప్పుడే కొనుగోలు చేయాలని పుస్తకాలకు సంబంధించి డబ్బులను చెల్లిస్తే అవి మీ ఇంటికి చేరుతాయని, విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేస్తూ ముందస్తుగానే డబ్బులు చెల్లించుకుని పుస్తకాలు విద్యాసంస్థల పేరుతో ముద్రించిన వాటిని విక్రయిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విద్యాసంవత్సర పేరుతో ముద్రించిన పుస్తకాలు బెల్టు, షూ, టై రకరకాల స్టేషనరీ వస్తువులను వేల రూపాయలకు విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఒకటవ,రెండవ , మూడవ తరగతి లాగా తరగతులు నిర్వహించాలని చెబుతున్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా మార్కెట్లో కూరగాయల రూపాలలో రకరకాల గ్రూపులు ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క గ్రూపుకు ఒక్కొక్క ఫీజు అంటూ విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి డబ్బులను జిలగల్లాగా బలవంతంగా వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక సెక్షన్కు అనుమతి తీసుకొని అదే బ్రాంచ్లో మూడు నాలుగు సెక్షన్లు నిర్వహిస్తూ, అనుమతులు తీసుకోకుండా నడుపుతూ అదే విధంగా పాత అనుమతులు అనే రెన్యువల్ చేసుకోకుండా జిల్లా విద్యాశాఖ అధికారులు బోల్తా కొట్టిస్తున్నారని తెలిపారు. ధర్మవరంలో అనుమతులు లేకుండా నడుపుతున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముందస్తుగా పాఠశాల అడ్మిషన్లు నిర్వహించిన పుస్తకాల వ్యాపారం చేసిన, అనుమతులు లేని విద్యా సంస్థలు పైన రకరకాల గ్రూపులు ఏర్పాటు చేసుకుని నడుపుతున్న విద్యాసంస్థల పైన ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు శ్రీనివాసులు, సంతోష్, వేణు, అశోక్ ,అనిల్, తదితరులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *