ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని)
విశాలాంధ్ర నందిగామ:-ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో మాజీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు కేంద్రీయ విశ్వవిద్యాలయ పరిశీలనకు వచ్చిన ఆయన స్థానిక శాసన సభ్యురాలు ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్యతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఎంతో హుందాతనంతో రాజధాని విషయంలో మాట్లాడాల్సి ఉందని అటువంటి సమయంలో ఇటీవల మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని నెలకొల్పేందుకు చేస్తున్న కృషి ఎనలేనిదని ఆ తరుణంలో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడాల్సిన తీరు సరిగా లేదని అన్నారు దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా ఉండేందుకు మద్దతు లభిస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఇలా మాట్లాడటం బాధాకరమని అన్నారు రాజధాని బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టినప్పుడు తనకు ఎంతో గర్వంగా ఉందని అది ఒక మరుపురాని క్షణాలు అని పేర్కొన్నారు అటువంటి అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అభినందనలు తెలియజేశారు అమరావతి ఉద్యమంలో నిత్యం పోరాడిన మహిళలకు,ఉద్యమకారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ అమరావతి రాజధాని సాధించుటలో వారు చేసిన పోరాటాలు మరువలేనివని పేర్కొన్నారు ఒక రాజధాని విషయాన్ని కామెడీ పీస్ ల తయారు చేసిన వ్యక్తి కి రాష్ట్ర ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 30 వేల ఎకరాలు చాలదు 50వేల ఎకరాలు కావాలి అన్న జగన్ ఆ తర్వాత అనుభంగా అధికారంలోకి వచ్చిన సమయంలో 500 ఎకరాలతో రాజధాని నిర్మించవచ్చు అని మూడు రాజధానులు అంటూ ప్రకటించి ప్రజలను అయోమయ పరిస్థితిలో పాలించి నేడు మావిగన్ అంటూ రాజధానిని కామెడీ పీస్ చేసిన ఘనత కు ప్రజలు గతంలో 151 గా ఉన్న సంఖ్యను 11 గా మార్చారని రానున్న ఎన్నికల్లో జగన్ రెడ్డికి 0 మిగులుతుందని ఎద్దేవా చేశారు రాజధాని విషయంలో కామెడీగా వ్యవహరించిన వ్యక్తిని మేము ముఖ్యమంత్రిగా చేసుకున్నామా అన్న సందిగ్ధంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ చేస్తున్న సేవలను సహకరిస్తున్న కూటమి నాయకులను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ తో ముందుకు సాగుతుందని సగర్వంగా తెలిపారు….


