మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.
విశాలాంధ్ర ధర్మవరం; ధర్మవరం రూరల్ పరిధిలో గత ఐదు సంవత్సరాలుగా సర్పంచులు గా ఉంటూ, ప్రలోభాలకు లొంగకుండా ఐదేళ్లు పార్టీగా అండగా నిలవడం గర్వించదగ్గ విషయము అని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని వైయస్సార్సీపి పార్టీ కార్యాలయంలో సర్పంచులకు ఆత్మీయ సభను వారు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజకీయ ఒత్తిడిలు భరించి కష్టపడి పని చేశారని మీ నిబృ దత్తత మరువలేమని రాబోయే రోజుల్లో పార్టీలో మంచి స్థానం కల్పిస్తామని వారు హామీ ఇచ్చారు. చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకొని వెళ్లాల్సిన అవసరము ఉందని వారు స్పష్టం చేశారు. ధర్మవరం నియోజకవర్గంలో ఎప్పుడూ తన మార్పుతో వైఎస్సార్సీపీ జెండా రెపరెపలాడుతుందని తెలిపారు. సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టి ఐదేళ్లపాటు పార్టీని నమ్ముకుని నా వెంట సర్పంచులు నడిచారని మీకు అన్నివేళలా రుణపడి ఉంటారని వారు కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో పార్టీలో మరింత ఉన్నతమైన ప్రాధాన్యత ఇచ్చి తీరుతామని వారు భరోసా కల్పించారు. నియోజకవర్గంలోని ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ, మండలాలకు చెందిన వైఎస్ఆర్సిపి సర్పంచులకు ఇటువంటి ఆత్మీయ సభను కేతిరెడ్డి తో పాటు సతీమణి సుప్రియ కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని సర్పంచులు కేతిరెడ్డి దంపతులను ఘనంగా సత్కరించారు. ధర్మవరం నియోజకవర్గంలో 70 మంది సర్పంచులకు గాను 64 మంది వైఎస్సార్సీపి పార్టీ తరఫున గెలవడం జరిగిందని తెలిపారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే త్రలోభాలకు లొంగి 11 మంది దాకా వేరే పార్టీలో మారడం జరిగిందన్నారు వారందరికీ భవిష్యత్తులో పార్టీలో చోటు ఉండదు అని వారు స్పష్టం చేశారు. గ్రామ కమిటీల సభ్యులతో కలిసి సమిష్టిగా పనిచేసి త్వరలో జరగనున్న సర్ ఓటు సర్వేలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కుట్రలు మోసాలు చేయడంలో చంద్రబాబును మించిన వారు ఎవరు లేరని తెలిపారు. గ్రామాల్లో ఉపాధి పనులు లేక ప్రజలు అవస్థలు పడుతున్నా కూడా అధికార పార్టీ ఏమాత్రం పట్టించుకోవడంలేదని వారు మండిపడ్డారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి రాజధానిగా చట్ట సవరణలు చేసి పార్లమెంటు ఉభయ సభలలో పెట్టి బిల్లును ఆమోదం తెలుపుకున్న వీరు ప్రత్యేక హోదా ఎందుకు అడగడం లేదని వారు ప్రశ్నించారు. రాష్ట్రంలో చంద్రబాబు పాలన పూర్తిగా గాడి తప్పిందని తెలిపారు.


