హైదరాబాద్: వరుస విజయాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్, ఇప్పుడు ‘డెకాయిట’ చిత్రంతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటబోతున్నాడు. ఏప్రిల్ 10, 2026న విడుదల కానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్, శేష్ కెరీర్లోనే అత్యధిక ప్రీ-రిలీజ్ బిజినెస్ నమోదు చేసింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, కేవలం తెలుగు వెర్షన్ నుండే ఈ సినిమా సుమారు రూ. 30 కోట్ల థియేట్రికల్ బిజినెస్ పూర్తి చేసుకుందట. అడివి శేష్ సినిమాలకు ఉండే మినిమం గ్యారెంటీ క్రేజ్ వల్లే బయ్యర్లు ఈ స్థాయి రేట్లకు హక్కులను దక్కించుకున్నారని తెలుస్తోంది. ఏరియా వారీగా బిజినెస్ లెక్కలు కనుక చూసుకుంటే నైజాం: రూ. 7 కోట్లు,ఆంధ్రప్రదేశ్: రూ. 10 కోట్లు (సుమారు),ఓవర్సీస్: రూ. 6.5 కోట్లు, మొత్తం తెలుగు రాష్ట్రాల బిజినెస్ రూ. 30 కోట్లు. కాగా, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ అనిపించుకోవాలంటే తెలుగు వెర్షన్లో కనీసం రూ. 50 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించాల్సి ఉంటుంది.
ఇందులో బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తుండటం, సెన్సేషనల్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో ఉండటం సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. శేష్ సినిమాల్లో ఉండే గ్రిప్పింగ్ స్క్రీన్ప్లే, ఈసారి యాక్షన్ బ్యాక్డ్రాప్లో ఎలా ఉంటుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు.
The post విడుదలకు ముందే ‘డెకాయిట’ హంగామా appeared first on Visalaandhra.


