ఇరాన్ యుద్ధంలోకి సౌదీ, యూఏఈ?


వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం
న్యూయార్క్: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ దాడులు కొనసాగిస్తోన్న నేపథ్యంలో వాల్‌స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం ప్రచురించింది. తెహ్రాన్‌తో జరుగుతోన్న యుద్ధంలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) పాల్గొనేందుకు సిద్ధమైనట్లు ఆ కథనం పేర్కొంది. ఇరాన్ తమ దేశంపై ఎన్ని దాడులు చేసినప్పటికీ ఓపికతో ఉన్న యూఏఈ ప్రస్తుతం అమెరికాతో చేతులు కలపనున్నట్లు ఆ కథనం పేర్కొంది. ఇరాన్ ీVAర్మూజ్‌ను మూసివేయడం వల్ల తమ దేశం ఇప్పటికే చాలా నష్టపోయిందని.. ఇకపై ఆవిధంగా జరగకూడదనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకుందని తెలిపింది. అదే జరిగితే ఇరాన్ యుద్ధంలో నేరుగా పాల్గొన్న మొదటి పర్షియన్ గల్ఫ్ దేశంగా యూఏఈ నిలవనుంది. గతంలో తమ వైమానిక స్థావరాలను అమెరికా సైన్యం ఉపయోగించుకొనేందుకు అనుమతించని సౌదీ అరేబియా.. ప్రస్తుతం అందుకు అంగీకరించినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ీVAర్మూజ్ జలసంధిని తెరిపించడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు తమ దేశం మద్దతిస్తోందని అధికారిక వర్గాలు పేర్కొన్నట్లు వెల్లడించింది. కాగా, ఇరాన్‌పై దాడుల కోసం యూఏఈ రహస్యంగా ప్రపంచ దేశాలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇందులోభాగంగానే అక్కడి నేతలు ఇరాన్‌పై చర్యలకు అధికారం ఇచ్చే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరమైతే బలప్రయోగం చేసైనా.. ీVAర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఒక కూటమిని ఏర్పాటుచేయాలని యూఏఈ దౌత్యవేత్తలు అమెరికా సహా యూరప్, ఆసియాలోని కీలక దేశాలను కోరుతున్నారు. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే ఇరాన్ ీVAర్మూజ్‌ను పూర్తిగా తన అధీనంలోకి తీసుకొని.. ప్రపంచ ఆర్థికవ్యవస్థను పతనం చేస్తుందని అందరికీ వివరిస్తున్నారు.

The post ఇరాన్ యుద్ధంలోకి సౌదీ, యూఏఈ? appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *